Samsung Galaxy F55 Launch: దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ ఫోన్లకు ఆదరణ ఎక్కువ. శక్తివంతమైన కెమేరా, ర్యామ్, బ్యాటరీ సామర్ధ్యం, ఇతర ఫీచర్లు, డిజైన్ వంటివి శాంసంగ్‌కు సొంతం. అందుకే శాంసంగ్ లాంచ్ చేస్తే ప్రతి మోడల్ మార్కెట్‌లో క్లిక్ అవుతుంటుంది. ఇప్పుడు మరో కొత్త మోడల్ లాంచ్ చేసేందుకు సిద్ధమౌతోంది.
Samsung త్వరలో లాంచ్ చేయనున్న ఫోన్ Samsung Galaxy F55 5G.ఈ ఫోన్ 6.7 ఇంచెస్ సూపర్ ఎమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. బ్రైట్‌నెస్ కూడా 1000 నిట్స్ ఉండటంతో క్లారిటీ బాగుంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తూ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.2 వెర్షన్, వైఫై 802 సపోర్ట్ చేస్తుంది.సెక్యూరిటీ కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ యాక్సెస్ ఉంటుంది. దీంతోపాటు యాక్సెలెరోమీటర్, గైరో, ప్రోక్సిమిటీ, కంపాస్ వంటి ఫీచర్లు ఉంటాయి.
45 వాట్స్ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబి ర్యామ్-128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ కలిగి ఉండటం వల్ల పనితీరు చాలా వేగంగా ఉంటుంది. హ్యాంగింగ్ సమస్య ఉండదు. శాంసంగ్ లాంచ్ చేస్తున్న కొత్త Samsung Galaxy F55 5G అప్రికాట్ క్రష్, రైసిన్ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. లాంచింగ్ కచ్చితంగా ఎప్పుడనేది తెలియకున్నా ఈ ఏడాదిలోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ అత్యంత సన్నని స్లైలిష్ లుక్‌లో ఉంటుంది.
ట్రిపుల్ కెమేరా ఆప్షన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం కూడా ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమేరా ఉండటం విశేషం.
ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయాలు జరగనున్నాయి. Samsung Galaxy F55 5Gలో 8 జీబీ ర్యామ్ృ-128 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 26,999 రూపాయలు ఉండవచ్చు. ఇక 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ అయితే 29,999 రూపాయలుంటుంది. ఇక 12జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 32,999 రూపాయలుంది.
Also read: Bajaj CNG Bike: 125 సిసి ఇంజన్‌తో బజాజ్ సీఎన్‌జి బైక్ ఫీచర్లు, మైలేజ్ వివరాలు ఇలా, లాంచ్ ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook