Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- ఒంటరయ్యామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు!

Russia-Ukraine War updates: రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండో రోజూ.. ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2022, 10:37 AM IST
  • రెండో రోజుకు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
  • 137 ఉక్రెయిన్ సైనికులకు మృతి
  • రష్యాను ఎదుర్కొంటామని ఉక్రెయిన్ ధీమా!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- ఒంటరయ్యామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు!

Russia-Ukraine War updates: రష్యా ఉక్రెయిన్​ మధ్య యుద్ధం రెండో రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్​పై రష్యా దాడులుకొన సాగుతున్నాయి. ఉక్రెయిన్ బలగాలపై రష్యాదాడులు కొనసాతున్నాయి. అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్​ను లక్ష్యంగా చేసుకుని దాడులకు చేస్తోంది పుతిన్​ సైన్యం. రష్యా దాడుల్లో ఉక్రెయిన్​కు చెందిన 137 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని వార్తా సంస్థ ఏఎఫ్​పీ పేర్కొంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆవేదన..

రష్యా దాడులను సమర్థంగా తిప్పికొడతామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్​ జెలన్​స్కీ ధీమా వ్యక్తం చేశారు. అయితే రష్యాను ఎదుర్కోవడంలో తాము ఒంటరిగా మిగిలిపోయామన్నారాయన.

ఉక్రెయిన్ మిత్ర దేశాలకు పుతిన్ హెచ్చరిక..

ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మరోసారి.. దాని మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. రష్యాకు వ్యతిరేకంగా ఏ దేశమైన చర్యలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ పౌరులను రక్షించుకోవడానికే ఉక్రెయిన్​పై దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. జనాలపై దాడి చేయడం తమ లక్ష్యం కాదని.. ఉక్రెయిన్​ ఆక్రమించుకునే ఆలోచన కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా స్పందన..

ఉక్రెయిన్​పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఖండించారు. నాటో సభ్య దేశాల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

అమెరికాలో నిరసనలు..

ఇక రష్యా దాడులను నిరసనిస్తూ.. అమెరికాలోని ఉక్రెయిన్ పౌరులు నిరసనలు తెలుపుతున్నారు. వైట్​ హౌస్ ముందు నిరసనలు చేస్తూ రష్యాను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also read: Ukraine vs Russia: హింసను తక్షణమే ఆపండి.. పుతిన్‌ను కోరిన ప్రధాని మోదీ!!

Also read: Russia-Ukraine War: రష్యా మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News