Chandrababu Naidu: గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలు తలెత్తడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఆదివారం అధికారుల సెలవులు రద్దు చేసి సహాయ చర్యల్లో ఉపక్రమింపచేశారు. ఫలితంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా వరద నియంత్రణ చర్యల్లో మునిగారు.
Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై మాజీ సీఎం జగన్ అలర్ట్.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన
వరుసగా రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. జిల్లాలు, శాఖల వారీగా తాజా పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. డ్రోన్లు, సీసీ కెమేరాల ద్వారా రియల్ టైంలో పరిస్థితిపై అధికార యంత్రాంగం స్పందించాలని సీఎం ఆదేశించారు. మీడియాలో, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లలో వచ్చే విజ్ఞప్తులపై తక్షణ స్పందించాలని చెప్పారు.
Also Read: Chandrababu: సీఎం చంద్రబాబు బిజీబిజీ.. భారీ వర్షాలతో రాత్రి నిద్రపోకుండా సమీక్ష
వరద తగ్గిన వెంటనే పంటనష్టంపై వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సీఎం ఆదేశించారు. వర్షాల తీవ్రత తగ్గినా వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదు కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని తెలిపారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడడంతో వెంటనే వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించి దానికి అనుగుణంగా సహాయ చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. వర్షాలు, వరదల కారణంగా ఆహారం, నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద, నూజువీడులో రికార్డు స్థాయి వర్షంపై ఆయా మంత్రులు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల వారికి బియ్యం, నిత్యావసరాలు సరఫరా చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
'వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలి. రైతులు, కుటుంబాలకు వెంటనే సాయం అందించాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టం అంచనా వేసి పంపాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన అధికారులు విధులు సరిగా నిర్వర్తించకుండా తప్పించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రులు కూడా క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter