GBS Disease: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. తాజాగా గులియన్ బారే సిండ్రోమ్ అంటే జీబీఎస్ వ్యాధి ఆందోళన రేపుతోంది. ఇప్పటికే తెలంగాణలో జీబీఎస్ వ్యాధితో ఓ మహిళ మరణించగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో మహిళ చనిపోయింది.
ఏపీలోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. తాజాగా ఓ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. గతంలో కరోనా సోకినవారిలో ఈ వ్యాధి ఎక్కువగా కన్పిస్తోందని వైద్యులు చెబుతున్నారు. జీబీఎస్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇమ్యునోగ్లోబిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జీబీఎస్ వ్యాధి ఎలా ఉంటుంది
వ్యాధి సోకిన వెంటనే ఆసుపత్రిలో చేరితే 4 వారాల్లోనే కోలుకోవచ్చు. ముదిరితే మాత్రం కోలుకునేందుకు సమయం పడుతుంది. చాలామందిలో ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన తరువాత 1-2 వారాలు పడుతుంది. ఇది అంటువ్యాధి కాదని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. చికిత్సతో నయం చేయవచ్చంటున్నారు.
జీబీఎస్ వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి సోకినవారిలో ఒళ్లంతా తిమ్మిరిగా ఉంటుంది. కండరాలు బలహీనంగా ఉంటాయి. డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తాయి. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. నాడీ వ్యవస్థపై ప్రభావం కన్పిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి