Kodali Nani: జూన్‌ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు కనిపించడు: కొడాలి నాని జోస్యం

Kodali Nani Fire On Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు చేస్తున్న రాజకీయంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 27, 2024, 07:13 PM IST
Kodali Nani: జూన్‌ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు కనిపించడు: కొడాలి నాని జోస్యం

Kodali Nani: రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు ప్రస్తుతం అధికారం కోసం పవన్‌కల్యాణ్‌ కాళ్లతోపాటు గాడిద కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. అధికారం కోసం ఎలాంటి నీచపు పని చేయడానికైనా సిద్ధమని చెప్పారు. జూన్‌ 4వ తేదీ తర్వాత చంద్రబాబు అదృశ్యమవుతారని జోస్యం చెప్పారు. అధికారంలోకి మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. సీఎంగా జగన్‌, ఎమ్మెల్యేగా తాను మరోసారి ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయాలి: కేటీఆర్‌ సంచలన సవాల్‌

 

గుడివాడ నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించిన అనంతరం ఓ చోట జరిగిన సభలో నాని మాట్లాడారు. 'అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జన సైనికులకు తప్ప' అని చెప్పారు. ఫలితాలు వెలువడిన అనంతరం జూన్ 4వ తేదీ తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు అని వెల్లడించారు.

Also Read: Legal Notice: మీడియా సంస్థలకు కేటీఆర్‌ భారీ షాక్‌.. బామ్మర్దితో ఛానల్స్‌కు రూ.160 కోట్ల నోటీసులు

 

'గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి అధిక సీట్లతో సీఎంగా జగన్‌ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు. ఒకవైపు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధి పనులు సీఎం జగన్‌ చేస్తున్నారు' అని కొడాలి నాని తెలిపారు. ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఇప్పుడు ఆగిపోయిన పనులు మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొనసాగిస్తామని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News