#CovidUpdates: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. గత 12 గంటల నుంచి టెస్ట్ ఏ చేసిన ఏ శాంపిల్ కూడా కోవిడ్ పాజిటీవ్‌గా తేలకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ వైద్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసు లు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి.
24 గంటల్లో 6,414 మంది మృతి
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసు లు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి#ApFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lgTKOJP19y
— ArogyaAndhra (@ArogyaAndhra) April 9, 2020
కాగా, ఏపీలో ఇప్పటికే 348 కరోనా పాజిటీవ్ కేసులు నిర్ధాయిన అయిన విషయం తెలిసిందే. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 75 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో జిల్లాల వారీగా గురువారం ఉదయం 9 గంటల వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాల విషయానికొస్తే... అనంతపురంలో 13, చిత్తూరులో 20, తూర్పు గోదావరి జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 49, కడప జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా వాలంటీర్ పోస్టులు.. ముందుకొస్తే ఓ ఆఫర్!
నెల్లూరులో 48, ప్రకాశం జిల్లాలో 27, విశాఖపట్నంలో 20, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కేసులు నమోదు కాగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు రెండూ ఒకటి కాదా.. ఇది చదవండి
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos