Ex Mla DY Das Suspended: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్.. వైసీపీ నుంచి సస్పెండ్.. హిట్ లిస్టులో ఇంకెవరు..?

Pamarru Ex Mla DY Das: వచ్చే ఎన్నికలకు అధికార వైసీపీ ఇప్పటినుంచే అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకుంటోంది. ఓ వైపు ఎమ్మెల్యేలను గ్రౌండ్ లెవల్లో తిప్పుతూ.. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై చర్యలు తీసుకుంటోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 03:44 PM IST
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేతలపై సీఎం జగన్ సీరియస్
  • పామర్రు మాజీ ఎమ్మెల్యేపై వేటు
  • 10 రోజుల గ్యాప్‌లో మరో నేతపై చర్యలు
Ex Mla DY Das Suspended: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్.. వైసీపీ నుంచి సస్పెండ్.. హిట్ లిస్టులో ఇంకెవరు..?

Pamarru Ex Mla DY Das: కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ క్రమశిక్షణ కమిటీ డీవై దాస్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటనను విడుదల చేసింది. 

పామర్రు నియోజకవర్గం నుంచి 2009లో డీవై దాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగిన ఆయన.. టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పనపై 6,940 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో పామర్రు టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు. తెలుగు దేశం పార్టీ టికెట్ దక్కపోవడంతో జనసేన పార్టీలో చేరారు. అక్కడ కూడా టికెట్ రాకపోడంతో వైసీపీ కండువా కప్పుకున్నారు

అప్పటి నుంచి అధికార పార్టీలో కొనసాగుతున్న డీవై దాస్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్నట్లు అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే డీవై దాస్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు వైసీపీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది.

అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు ఎలాంటి సమాచారం అందలేదని డీవై దాస్ తెలిపారు. తాను ఎప్పుడు పార్టీకి ఇబ్బంది కలిగించేలా చేయలేదన్నారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ తనను పార్టీ కార్యక్రమాలకు పిలవకపోయినా.. తాను ఎప్పుడు ఫిర్యాదు చేయలేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. 
 
వైసీపీ నుంచి వరుసగా నేతలపై వేటు పడుతుండడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవలె గుంటూరు జిల్లాకు చెందిన మాజీ శాసన సభ్యులు రావి వెంకటరమణపై అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయన కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో అధిష్టానం చర్యలు తీసుకుంది. రావి వెంకటరమణను సస్పెండ్ చేసిన 10 రోజుల గ్యాప్‌లోనే మరో మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌పై వేటు వేయడంతో అధిష్టానం హిట్ లిస్ట్‌లో ఎవరున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

2024 ఎన్నికలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. గడప గడపకు ఎమ్మెల్యేలను పంపిస్తూ.. వారిని గ్రౌండ్ లెవల్లో ఓటర్లుకు దగ్గర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదని ఇది వరకే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపలకు పాల్పడుతున్న నేతల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Also Read: AICC NEW PRESIDENT: 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి పగ్గాలు.. కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే ఘన విజయం

Also Read: KCR Munugode Campaign: బీజేపీతో తాడోపేడో  తేల్చుకోనున్న కేసీఆర్.. ఢిల్లీ నుంచి రాగానే మునుగోడు టూర్.. వారం రోజుల పాటు అక్కడే బస?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News