కడప: డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు పత్రంలో ట్రాన్స్ జెండర్ అనే ఆప్షన్ ను జోడించారు. దీంతో ట్రాన్స్ జెండర్స్ కు లైసెన్సులు జారీ చేసే మార్గం సుగమమైంది. గతంలో దరఖాస్తు ఫాంలో ఈ ఆప్షన్ లేని కారణంగా ట్రాన్స్ జెండర్లకు లైసెన్సుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తాజా నిర్ణయంతో ఇక నుంచి వారికీ లైసెన్సు పొందే హక్కుకలిగింది. ఈ మేరకు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.
దేశంలోనే తొలిసారిగా ...
ప్రముఖ మీడియా కథనం ప్రకారం..తాజా ఆదేశాల మేరకు కడప జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పలువురు ట్రాన్స్ జెండర్ కు లైసెన్సులు జారీ చేశారు. రవాణ శాఖ డీటీసీ బసిరెడ్డి ఆధ్వర్యంలో 32 మందికి శనివారం లైసెన్సును అందించారు. దీంతో దేశంలో తొలిసారి ట్రాన్స్ జెండర్‌కు లైసెన్స్ జారీ చేసినట్లయింది. ఈ వినూత్న కార్యక్రమానికి కడప జిల్లా వేదికగా నిలవడం గమనార్హం