అమరావతి: త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు (Rajyasabha election 2020) జరగనున్న నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ (YSRCP) తరపున నలుగురు రాజ్య సభ సభ్యుల పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాలో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), రెవిన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash Chandrabose), రాంకీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ అయోధ్య రామిరెడ్డి (Ayodhya Rami Reddy), పరిమల్ నత్వాని ఉన్నారు. వీళ్లందరి రాజ్యసభ పదవీ కాలం ఏప్రిల్ 4తో ముగియనుంది.
ప్రస్తుతం కేబినెట్ మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ ఎమ్మెల్సీలుగా ఉండగా.. శాసన మండలి రద్దు కోసం ప్రయత్నిస్తున్న క్రమంలోనే వీరిని రాజ్యసభకు పంపించాలని భావించినట్టు తెలుస్తోంది. ఇక పరిమళ్ నత్వానీ విషయానికొస్తే... ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ముచ్చటగా మూడోసారి పెద్దల సభలో అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీకి (Mukesh Ambani) సన్నిహిత మిత్రుడు, కంపెనీ వ్యవహారాల్లో పాల్పంచుకునే బిజినెస్మేన్ అయిన పరిమళ్ నత్వాని (Parimal Nathwani) ఇటీవలే అంబానీతో కలిసి వచ్చి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..