Stock Market: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాలను చూస్తున్నాయి. ఆ తర్వాత మళ్లీ తేరుకున్నాయి. ప్రస్తుతం తీవ్ర అనిశ్చిత్తిలో ఉన్నాయి.
ట్రేడింగ్ సమయంలో, 1740 షేర్లు పెరిగాయి, 1662 షేర్లు క్షీణించాయి. 116 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. నిఫ్టీ మళ్లీ నష్టాల్లో ఉంది. ప్రస్తుతం 108.6 పాయింట్లు పతనమై 23,399.80 స్థాయి వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ 268.12 పడిపోయి 77,232.45 స్థాయిలో ట్రేడవుతోంది. శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం ఉదయం 100 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో దాదాపు 400 పాయింట్లు లాభపడి 77, 899 వద్ద గరిష్టానికి చేరుకుంది. అయితే బడ్జెట్ ప్రసంగం మొదలైన కొద్ది సేపటికి నష్టాల్లోనే జారుకుంది. గరిష్టం నుంచి ఏకంగా దాదాపు 900 పాయింట్ల కోల్పోయింది. 77,066 వద్దకు చేరుకుంది.
సెన్సెక్స్‌లో హెచ్‌ఎఫ్‌సీఎల్, ప్రెస్టేజ్ ఎస్టేట్, మారుతీ సుజుకీ, గోద్రేజ్ కన్స్యూమర్ షేర్లు లాభాల్లో ఉండగా...ఎస్కార్ట్ కుబోటా, జిందాల్ స్టెయిన్‌లెస్, హుడ్కో, లార్సన్ షేర్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ 172 పాయింట్ల నష్టంతో ఉంది.
Also Read: Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook