Allu Arjun: అల్లు అర్జున్ కొడుకుని తీసుకొస్తా అని ప్రామిస్ వేసిన హీరో.. ఫ్యాన్స్ కి పండగే!

Allu Sirish Buddy: రెండేళ్లకి ఒక సినిమా చేస్తున్న.. అల్లు శిరీష్ తాజాగా ఇప్పుడు బడ్డీ అనే సినిమాతో.. తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో.. మాట్లాడుతూ తన అన్న కొడుకు అల్లు అయాన్.. గురించి అల్లు శిరీష్ చేసిన.. కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 26, 2024, 02:37 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ కొడుకుని తీసుకొస్తా అని ప్రామిస్ వేసిన హీరో.. ఫ్యాన్స్ కి పండగే!

Allu Aayan: ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి.. అలు శిరీష్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు. 2022లో.. ఊర్వశివో రాక్షసివో.. సినిమాతో పర్వాలేదు అనిపించిన.. అల్లు శిరీష్ ఈసారి బడ్డీ.. అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మంచి అంచనాల మధ్య.. ఈ సినిమా జూలై 26న థియేటర్లో విడుదల కాబోతుంది. 

ఈ సినిమాలో ఒక టెడ్డీ బేర్ కూడా కీలకపాత్ర పోషించనంది. మాట్లాడే నడిచే ఒక టెడ్డి బేర్ ప్రపంచంలో.. జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి అనుకుంటుంది. దానికోసం పైలట్ గా పనిచేస్తున్న హీరో అల్లు శిరీష్ ని సహాయం కోరుతుంది. తర్వాత ఏం జరుగుతుంది.. అనే ఒక ఆసక్తికరమైన ప్లాట్ లైన్ తో ఈ సినిమా నడుస్తుంది.

నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ట్రైలర్.. రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ అల్లు శిరీష్ ఫాన్స్ కి ఒక ప్రమాణం చేసేసారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. అల్లు అయాన్ ని తీసుకువస్తారా అని ఫాన్స్ సరదాగా అడిగితే కచ్చితంగా తీసుకు వస్తాను అంటూ కమిట్మెంట్ ఇచ్చేశారు అల్లు శిరీష్.

"అల్లు అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. సోషల్ మీడియా మొత్తం వాడి హవా నడుస్తోంది" అంటూ నవ్వేశారు అల్లు శిరీష్. అయితే అల్లు అర్జున్ ని తీసుకొస్తారా అంటే కుదిరితే చూద్దాం అని సైలెంట్ గా తప్పించుకున్నారు. 

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అల్లు శిరీష్ తన కుటుంబ సభ్యులతో.. దిగే ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పిల్లలతో కూడా అల్లు శిరీష్ సరదాగా గడుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అల్లు అయాన్ ను వెంటనే తీసుకు వస్తానని చెప్పేసారు.

ఇక బడ్డీ విషయానికి వస్తే శామ్ అంటోన్.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా లో ప్రిష రాజేష్ సింగ్ హీరోయిన్ గా నటించింది. అజ్మల్ అమీర్ కూడా కీలకపాత్ర పోషించిన.. ఈ సినిమాకి హిప్ హాప్ తమీజ సంగీతాన్ని అందించారు. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ ఎంతవరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News