Nag Ashwin: దర్శకుడిగా కాకుండా.. నటుడిగా నాగ్ అశ్విన్ నటించిన ఈ సినిమాలు తెలుసా..

Kalki Director Nag Ashwin: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత నాగ్ అశ్విన్ కు సరిగ్గా సరిపోతుంది. కేవలం రెండే రెండు చిత్రాల అనుభవంతో తన కథ, కథనంతో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను మెప్పించడం మాములు విషయం కాదు. అంతేకాదు మూడో సినిమాతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా సత్తా చూపెట్టాడు. ఇక ఈయన నటుడిగా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 28, 2024, 09:42 AM IST
Nag Ashwin: దర్శకుడిగా కాకుండా.. నటుడిగా నాగ్ అశ్విన్ నటించిన ఈ సినిమాలు తెలుసా..

Kalki Director Nag Ashwin: ‘కల్కి 2898 AD’ మూవీతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా దర్శకుల జాబితాలోకి వచ్చేసాడు నాగ్ అశ్విన్. అంతకు ముందు కేవలం రెండే రెండు చిత్రాలను తెరకెక్కించాడు. ఒకటి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. రెండు ‘మహానటి’.  ఈ రెండు చిత్రాలను తన మామ గారి బ్యానర్ అయిన వైజయంతీ మూవీస్ బ్యానర్ పైనే తెరకెక్కించాడు. తాజాగా మూడో చిత్రాన్ని కూడా వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. అయితే ప్రభాస్ వంటి స్టార్ హీరోను తన సబ్జెక్ట్ తో పాటు నేరేషన్ తో మెప్పించిన నాగ్ అశ్విన్.. తాను తెరకెక్కించాలనుకున్న సబ్జెక్ట్ ను అంతే పకడ్బందీగా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు. ‘కల్కి 2898 AD’ మూవీతో నాగ్ అశ్విన్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.

అంతేకాదు మూడో సినిమాలోనే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్స్ ను పెట్టి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా తనదైన శైలిలో కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాను ‘కల్కి 2898 AD’ మూవని తెరకెక్కించాడు. ఈ సినిమాకు రెండు సీక్వెల్ ను శ్రీ కృష్ణుడు నిర్యాణం చెందిన 3102 BC టైటిల్ ను అనుకున్నట్టు సమాచారం. ఈ సారి మహాభారతం నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. కల్కి .. కలియుగంలో నాల్కో పాదంలో ధర్మం పూర్తిగా నశించి పాపం తాండవించినపుడు శ్వేతాశ్వంపై చేత కత్తితో శంబల గ్రామంలో విష్ణు శర్మ అనే బ్రహ్మాణోత్తముడి కుమారుడిగా జన్మించి దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ చేస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..

ఆ సంగతి పక్కన పెడితే.. నాగ్ అశ్విన్ దర్శకుడిగా మారకముందు పలు సినిమాల్లో  నటించాడు. ‘నేను మీకు తెలుసా’, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రాల్లో అలా కనిపించారు. శేఖర్ కమ్ముల దగ్గర దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకున్న నాగ్ అశ్విన్.. మూడో సినిమాతో ప్యాన్ ఇండియా దర్శకుడిగా సత్తా చాటడం మాములు విషయం కాదు. ఏది ఏమైనా తెలుగులో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్.

ఇదీ చదవండి: మన దేశంలో వారాహీ అమ్మవారు దేవాలయాలు ఎక్కడున్నాయి.. వాటి ప్రత్యేకతలు ఏమిటంటే.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News