Dhanush - Captain Miller: ధనుశ్‌కు తెలుగు ఆడియన్స్ బిగ్‌షాక్.. పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని కెప్టెన్ మిల్లర్..

Dhanush - Captain Miller: ధనుశ్ తమిళ హీరో అయినా తెలుగులో కూడా ఈయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీసెంట్‌గా ఈయన కెప్టెన్ మిల్లర్ వంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీతో పలకరించారు. తమిళంలో ఓ మోస్తరుగా నడుస్తోన్న ఈ మూవీ తెలుగులో సోదిలో లేకుండా పోయింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 1, 2024, 10:10 AM IST
Dhanush - Captain Miller: ధనుశ్‌కు తెలుగు ఆడియన్స్ బిగ్‌షాక్.. పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని కెప్టెన్ మిల్లర్..

Dhanush - Captain Miller: ధనుశ్ రజినీకాంత్ అల్లుడగానే కాకుండా అతని కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తన సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను పలకరిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ 'సార్' మూవీతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే మంచి వసూళ్లను రాబట్టింది. 'సార్' వంటి సాలిడ్ హిట్‌తో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్న ధనుశ్ తాజాగా 'కెప్టెన్ మిల్లర్‌' సినిమాతో పలకరించాడు. తమిళంలో ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి కాస్తో కూస్తో వసూళ్లు వచ్చాయి.  అక్కడ విడుదలైన రెండు వారాల తర్వాత తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ ఓ మోస్తరు వసూళ్లను రాబడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ సినిమా బొక్క బోర్లా పడింది. రిపబ్లిక్ డే హాలీడేను ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది.

మొత్తంగా తెలుగులో రూ. కోటి లోపు షేర్ మాత్రమే సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా రూ. 1.9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే ఇలా ఉంటే ఆ తర్వాత వీక్ డేస్‌లో ఈ సినిమా కంప్లీట్ వాష్ అవుట్ అయిపోయింది. మొత్తంగా థియేటర్ రెంట్ రాబట్టలేక చేతులెత్తేసిందనే చెప్పాలి. రూ. 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇంకా రూ. 3 కోట్ల షేర్ రాబట్టాల్సిన అవరసం వుంది. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఈ సినిమా కోలుకోవడం కష్టమే. మొత్తంగా ఫస్ట్ వీకెండ్లోనే చేతులేత్తేసిన ఈ సినిమా తెలుగులో భారీ నష్టాలనే మిగిల్చింది. తమిళంలో ఈ సినిమా రూ. 40 కోట్ల షేర్ (రూ. 75 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.  ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఉన్న పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక సందీప్ కిషన్ కూడా ఈ మూవీలో మరో ముఖ్యపాత్రలో నటించాడు.

కెప్టెన్ మిల్లర్ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం వెనక పెద్ద రీజనే ఉంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ అయివుంటే పరిస్థితి వేరేలా ఉండేది. తమిళంలో ముందుగా రిలీజై టాక్ తేడా కొట్టడంతో ఇక్కడ పెద్దగా బజ్ ఏర్పడలేదు. దీంతో నిండా మునిగిపోయింది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జునతో కలిసి చేస్తోన్న సినిమాతోనైనా ధనుశ్ తెలుగులో మళ్లీ తన మార్కెట్ నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.  

Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ

 

Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News