Sooraj Pancholi Released బాలీవుడ్ నటి జియాఖాన్ సూసైడ్ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. దాదాపు పదేళ్ల తరువాత ఈ కేసులో తీర్పు వచ్చింది. జియా ఖాన్ సూ కారణమయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న ప్రముఖ నటుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. 2013 జూన్‌లో జియా ఖాన్ తన ఇంట్లో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.
జియా ఖాన్ సూసైడ్ టైంలో ఆరు పేజీల ఆత్మహత్య లేఖ పోలీసుల చేతికి చిక్కింది. జియా ఖాన్ తల్లి కూడా సూరజ్ మీదే అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఈ కేసు అంతా కూడా సీబీఐ చేతికి వచ్చింది. పదేళ్ల తరువాత ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. సూరజ్ కారణంగానే జియా ఖాన్ సూసైడ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసులో సూరజ్ పంచోలిని నిర్దోషిగా ప్రకటించింది కోర్టు.
జియా ఖాన్ మృతికి ప్రియుడు సూరజ్ పంచోలీ కారణమని జియా తల్లి రబియా ఖాన్ ఆరోపించడం.. జియా రాసిన సూసైడ్ లేఖలో విషయాల ఆధారంగా సూరజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ జియా తల్లి బాంబే హైకోర్టును ఆశ్రయించచడంతో.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు.
Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్
ఈ సూసైడ్ కేసులో 22 మంది సాక్ష్యులను విచారించారు. గత వారం సీబీఐ స్పెషల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వడంతో సూరజ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తుది తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పును జియాఖాన్ తల్ పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. ఇక జియా ఖాన్ సినీ కెరీర్ ఇలా ఉంది. బిగ్ బీ.. నిశబ్ధ్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమిర్ ఖాన్ గజిని, హౌజ్‌ఫుల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో జియా ఖాన్ నటించింది.
Also Read: Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook