Ravanasura Movie Teaser మాస్ మహారాజా రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమా రాబోతోన్న విషయం తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో సుశాంత్ ముఖ్య పాత్రను పోషించాడు. తాజాగా రావణాసుర సినిమా టీజర్‌ను మేకర్లు విడుదల చేశారు. అయితే ఈ టీజర్లో రవితేజ మాత్రం మరీ వయలెంట్‌గా కనిపిస్తున్నాడు. దారుణాతి దారుణంగా చంపేస్తున్నాడు. సీతను తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడ్ని దాటాలి అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది.
ఈ టీజర్‌ను చూస్తుంటే ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అని తెలుస్తోంది. రవితేజ వరుసగా హత్యలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక జయరామ్ వాటిని కనిపెట్టే ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ప్రతీ కిల్లర్ మర్డర్ చేసినప్పుడు తన సైన్ వదిలి వెళ్తాడు.. ఆ సైన్ ఏంటో కనిపెట్టాలి అంటూ చెప్పిన డైలాగ్ బాగుంది. మొత్తానికి టీజర్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశాడు సుధీర్ వర్మ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook