RC 16 - Jagapathi Babu: సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘రంగస్థలం’ మూవీలో రామ్ చరణ్ ను ఢీ కొట్టే ప్రతి నాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. ఉప్పెన వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. RC16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. దేవర తర్వాత జాన్వీకి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు జగపతి బాబు ప్రతినాయకుడిగా పాత్రలో అలరించనున్నారు.
అటు మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుతూ జగపతిబాబు ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అంతేకాదు తన పాత్రకు సంబంధించి బిహైండ్ ది సీన్ వీడియోను ఆయన షేర్ చేశారు. అంకిత భావంతో తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోయే నటుడిగా జగపతిబాబుకి పేరుంది.
Chaala Kaalam tharavaatha @BuchiBabuSana #RC16 ki manchi pani pettaadu.. get up choosina tharavaatha Naaku chaala thrupthi ga undhi. pic.twitter.com/aaiQ8HPErp
— Jaggu Bhai (@IamJagguBhai) January 16, 2025
జగపతిబాబు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చాలా కాలం తర్వాత RC 16కోసం బుచ్చిబాబు సానా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చిన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో జగ్గూ భాయ్ లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉంది. జగపతిబాబు ఇప్పటి వరకు చూడనటువంటి సరికొత్త అవతార్‌లో ప్రేక్షకులకు కనిపించబోతున్నారు.
RC 16కు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్ల వర్క్ చేస్తున్నారు. సరికొత్త కథ, కథనాలతో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా RC 16ను రూపొందిస్తున్నారు బుచ్చిబాబు. సినిమా షూటింగ్, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.