Shatrughan Sinha shares saif ali khan and kareena ai pics: బాలీవుడ్ నటుడు సైఫ్ పై ఇటీవల ముంబైలోని బాంద్రా దాడి జరిగింది.ఆయన నివాసంలో చీరికి వచ్చిన విజయ్ దాస్ అనే దుండగుడు కత్తితో ఇష్టమున్నట్లు దాడికి పాల్పడ్డాడు . దీంతో తోపులాట సంభవించింది. ఈ క్రమంలో సైప్ కుమారుడు మేల్కొన్నాడు. అప్పటికే దుండగుడ్ సైఫ్ ను పలు చోట్ల కత్తితో పొడిచాడు. ఆ తర్వాత సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి తరలించారు.
డాక్టర్లు రెండు సర్జరీలు చేసి.. వెన్నుపాములో కత్తిని తొలగించారు. ఇదిలా ఉండగా ముంబై క్రైమ్ పోలీసులు ఘటనను సీరియస్ గా తీసుకున్నారు.పోలీసులు సీసీ కెమెరాలన్ని జల్లెడ పట్టి .. నిందితుడ్ని గుర్తించారు. అదే విధంగా ముంబైలో నిందితుడు ఉన్నట్లు గుర్తించి.. అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కోర్టు నిందితడు విజయ్ కాంత్ కు రిమాండ్ విధించింది.
ఇదిలా ఉండగా.. సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా తన ఇన్ స్టాలో పొస్ట్ పెట్టారు. తనకేంతో ఇష్టమైన వ్యక్తి, ఆప్తుడికి ఇలా జరగడం బాధను కల్గించిందన్నాడు. అంతే కాకుండా... సైఫ్ తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నట్లు చెబుతూ.. సైప్, కరీనా కపూర్ల ఏఐ ఇమేజ్ నవ్వుతూ.. ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నట్లు పోస్ట్ పెట్టారు. ఇది వివాదాస్పదంగా మారింది.
ఆస్పత్రిలో ఎవరైన నవ్వుతూ ఉంటారా.. అని నెటిజన్లు ఏకీ పారేస్తున్నారు. అంతేకాకుండా.. వాళ్లు అసలే బాధలో ఉన్నారు.. ఇప్పుడి క్రియేటివిటీ అవసరమా.. అంటూ ఫైర్ అవున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బాలయ్య భామ ఊర్వశి రౌతేలా సైతం వివాదాస్పదంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter