Om Namo Venkatesaya Chant : తిరుమలలో వినిపించే 'ఓం నమో వేంకటేశాయ'.. పాడింది ఈమెనట.. నెటిజన్ల రియాక్షన్ ఇదే

Singer Vaishnavi Mother సింగర్ వైష్ణవి తల్లి గురించి ఇప్పుడు అందరికీ ఓ విషయం తెలిసి వచ్చింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో సింగర్ వైష్ణవి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ తరువాత తన తల్లిని స్టేజ్ మీదకు తీసుకొచ్చింది. తిరుమలలో వినిపించే ఓం నమో వేంకటేశాయ అనే మంత్రాన్ని పాడింది తన తల్లే అని చెప్పుకొచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 06:06 PM IST
  • ఓం నమో వేంకటేశాయ నామస్మరణ
  • తిరుమల కొండపై వినిపించే వాయిస్
  • సింగర్ వైష్ణవి తల్లిపై నెటిజన్ల ప్రశంసలు
Om Namo Venkatesaya Chant : తిరుమలలో వినిపించే 'ఓం నమో వేంకటేశాయ'.. పాడింది ఈమెనట.. నెటిజన్ల రియాక్షన్ ఇదే

Singer Vaishnavi Mother తిరుమల కొండ మీదకు వెళ్తే కలిగే ప్రశాంతత, భక్తిభావాన్ని మాటల్లో వర్ణించలేం. కొండ మీద ఎక్కడకు వెళ్లినా కూడా ఆ వేంకటేశ్వరుని నామస్మరణే వినిపిస్తుంది. నిత్యం వేంకటేశ్వర పారాయణం జరుగుతూ ఉంటుంది. అయితే ఓం నమో వేంకటేశాయ అంటూ వచ్చే ఆ నామస్మరణను రికార్డింగ్ ఎప్పుడో చేశారు. దాన్నే ఆడియో రూపంలో ప్లే చేస్తుంటారు. అయితే ఆ నామస్మరణను అంత అందంగా, భక్తిభావంతో పాడింది ఎవరో తాజాగా బయటకు వచ్చింది.

శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ప్రోమో అంతా ఎలా ఉన్నా కూడా చివర్లో మాత్రం అందరిలోనూ భక్తి భావాన్ని పెంచేలా ఉంది. మధ్యలో రామ్ ప్రసాద్ కుళ్లు కామెడీలు, ఆ జంబలకిడి పంబలాంటి స్కిట్లు కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా కూడా చివర్లో మాత్రం ప్రోమో స్థాయిని పెంచేశారు.
 

సింగర్ వైష్ణవి రావయ్య ముద్దులమామ అంటూ రొమాంటిక్ పాటను స్టార్ట్ చేసింది. ఈమె పాడుతుంటే.. వాళ్ల అమ్మ కూడా హమ్ చేస్తుందట.. ఆమె కూడా సింగరే కదా? అని రామ్ ప్రసాద్, ఆది వంటి వారు అడిగేశారు. అవును అని అసలు సీక్రెట్ చెప్పింది సింగర్ వైష్ణవి. తిరుమల కొండ మీద వినిపించే ఓం నమో వేంకటేశాయ అనే మంత్రాన్ని తన అమ్మకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు రికార్డ్ చేశారని, అప్పటి నుంచి అదే వాయిస్‌లో అక్కడ ఆ మంత్రం వినిపిస్తోందని చెప్పుకొచ్చింది.

 

ఆ తరువాత స్టేజ్ మీదకు తన అమ్మను పిలిచింది వైష్ణవి. ఆ తరువాత తల్లీకూతుళ్లిద్దరూ కలిసి ఓం నమో వేంకటేశాయ అని పారాయణం చేశారు. అలా ఆ ఇద్దరూ పాడుతూ ఉంటే.. నిజంగానే తిరుమల కొండ మీదున్న అనుభూతి కలిగిందని శ్రీదేవీ డ్రామా కంపెనీ టీం అనేసింది. యూట్యూబ్‌లోనూ కింద క కామెంట్లలోనూ నెటిజన్లు కూడా అలానే అన్నారు. నిజంగానే తిరుమలలో ఉన్న అనుభూతి కలిగిందంటూ నెటిజన్లు ఆమెను పొగిడేస్తున్నారు.

వచ్చే ఆదివారం నాడు మహిళల కోసం ప్రత్యేకంగా ఎపిసోడ్ చేస్తున్నారు. మార్చి నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని ఉమెన్స్ డేగా సెలెబ్రేట్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఎపిసోడ్‌లను మహిళలకు అంకితం ఇచ్చేలా డిజైన్ చేశారు. కానీ ఇందులో చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌లు, వేసిన కుళ్లు జోకులు చూస్తుంటూ మల్లెమాల టీం మీద జాలి వేస్తుంది.

Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!

Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News