Kajal Aggarwal Pregnant: వైరల్ ఫొటోస్.. బేబీ బంప్‌తో కాజల్‌ అగర్వాల్‌!!

కాజల్‌ అగర్వాల్‌ తాజాగా తన స్నేహితులతో కలిసి సదరగా సరదాగా బయటకు వెళ్లారు. అందుకు సంబందించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. ఇందులో కాజల్‌కు బేబీ బంప్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 04:10 PM IST
  • బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్
  • బేబీ బంప్‌తో కాజల్‌ అగర్వాల్‌
  • బేబీ బంప్‌తో ఉన్న కాజల్‌ ఫొటోలు వైరల్
Kajal Aggarwal Pregnant: వైరల్ ఫొటోస్.. బేబీ బంప్‌తో కాజల్‌ అగర్వాల్‌!!

Kajal Aggarwal's Baby Bump photos goes viral : 2004లో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) సినీ పరిశ్రమకు వచ్చారు. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో పంజాబీ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. అందం, అభినయంతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్, రానా, నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, చిరంజీవి ఇలా స్టార్ హీరోలంద‌రి సినిమాల్లోనూ న‌టించి.. న‌టిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చారు. కెరీర్ మంచి ఊపులో ఉండగానే గతేడాది అక్టోబర్‌ 30న తన చిరకాల మిత్రుడు, ముంబై వ్యాపావేత్త గౌతమ్‌ కిచ్లు (Gautam Kitchlu)ను పెళ్లి చేసుకున్న కాజల్‌.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. 

పెళ్లి అనంతరం కూడా కాజల్‌ అగర్వాల్‌ సినిమా షూటింగ్స్‌తో బిజీబిజీ ఉన్నారు. అయినా కూడా సమయం దొరికినప్పుడల్లా భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి విహార యాత్రలకు వెళుతుంటుంది. కాజల్‌ గర్భం దాల్చిందని ఇదివరకే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ఇటీవల ఓ ఇంటర్య్వూలో స్పందించిన కాజల్..  సమయం వచ్చినప్పుడు అన్ని చెపుతా అని పేర్కొన్నారు. మాతృత్వం అనేది గొప్ప విష‌యమన్నారు. కానీ అసలు విషయం మాత్రం కాజల్ చెప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: Aakash Chopra: టీమిండియాలో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.. అతడికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు కష్టమే: ఆకాశ్‌

కాజల్‌ అగర్వాల్‌ తాజాగా తన స్నేహితులతో కలిసి సదరగా సరదాగా బయటకు వెళ్లారు. అందుకు సంబందించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశారు. 'బే అండ్ మీ' అంటూ ఫొటోలు పోస్ట్ చేశారు. ఇందులో కాజల్‌కు బేబీ బంప్‌ (Baby Bump) ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో కాజల్ నిజంగానే గర్భం (Kajal Aggarwal Pregnant) దాల్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాజల్ త్వరలోనే ఓ శుభావార్త చెప్పనున్నారు అని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి కాజల్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. కాజల్‌కు పెళ్లై ఏడాది అయిన విషయం తెలిసిందే. కాజల్‌ సోదరి నిషా అగ‌ర్వాల్‌కు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

మెగా స్టార్ చిరంజీవితో క‌లిసి కాజ‌ల్ అగ‌ర్వాల్ (Kajal Aggarwal) 'ఆచార్య‌' సినిమాలో న‌టించారు. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌వుతుంది. బాలీవుడ్‌లో 'ఉమ' అనే సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇందులో మిస్టీరియ‌స్ అమ్మాయి పాత్ర‌లో కాజల్ నటించనున్నారు. ఇవి కాకుండా తెలుగు, త‌మిళం, హిందీలోనూ వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా మొదలైన 'ఇండియ‌న్ 2'లోనూ క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి కాజల్ న‌టించారు. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగింది. 

Also Read: Peng Shuai: నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు.. యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News