Pawan Kalyan On Aha Promo పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్స్‌లోనే ఎక్కువగా కనిపించడు. అలాంటిది బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్టుగా రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. చిరంజీవి హోస్ట్ చేసిన షోలకు కూడా పవన్ కళ్యాణ్ వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఇలా బాలయ్యతో కలిసి షోలో పాల్గొనడంతో ఆ ఎపిసోడ్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో బజ్ నెలకొంది. ఈ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.
బాలా అని పిలవని అందరితో చెబుతుంటాను అని బాలయ్య అంటే.. నేను ఓడిపోవడానికి సిద్దంగా ఉన్నా మీరున్నారా? అని పవన్ కళ్యాణ్ అడుగుతాడు. ఇవే పాలిటిక్స్ వద్దని అంటున్నా అని బాలయ్య కౌంటర్ వేస్తాడు. మీ అన్నయ్య దగ్గరి నుంచి నేర్చుకున్నది ఏంటి?.. వద్దని అనుకున్నవి ఏంటి? అని బాలయ్య ఇరుకున పెట్టేశాడు. దానికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పాడన్నది ఆసక్తికరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook