Anti Ageing Juice: తాజా పండ్ల రసాలు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అల్లోపతి నుంచి నేచురోపతి వరకు.. ఆయుర్వేదం నుంచి మొదలైన అన్ని రకాల వైద్య విధానాల్లో పండ్ల రసాలకు ప్రాముఖ్యత ఉంది. పండ్లు, వాటి నుంచి తీసిన రసాలు అనేక వ్యాధుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయని వైద్యులు అంటున్నారు. పండ్ల రసాల వల్ల వృద్ధాప్య సంకేతాలను దూరంగా ఉంచొచ్చని తెలుస్తోంది.
ప్రతిరోజూ పండ్ల రసాలు (జ్యూస్) తాగడం వల్ల ఎప్పుడూ యవ్వనంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ నిత్యయవ్వనంగా కనిపించేందుకు తాగాల్సిన పండ్ల రసాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్యానికి 5 పండ్ల రసాలు
క్యారెట్ జ్యూస్
క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అందంగా ఉండటమే కాకుండా ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యారెట్ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, లుటిన్.. మన కళ్లతో పాటు మెదడుకు మేలు చేస్తాయి. దీంతో పాటు క్యారెట్ జ్యూస్ వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
దానిమ్మ రసం
దానిమ్మ రసంలో వృద్ధాప్యం నుండి రక్షించే అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అలాగే ఇన్‌ఫ్లమేటరీ సమస్య, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ఇది వృద్ధాప్య కణాలను ప్రభావితం చేస్తుంది. శరీర వయస్సును ప్రభావితం చేయదు. ఇది పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్ జ్యూస్ వృద్ధాప్య ప్రభావాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది చర్మానికి, గుండెకు చాలా మేలు చేస్తుంది. బీట్‌రూట్ జ్యూస్ తాగేవారి రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది.
వీట్ గ్రాస్ జ్యూస్
యాంటీ ఏజింగ్ విషయంలో వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ వృద్ధాప్య ప్రభావాలను నియంత్రించవచ్చు. ఇది వృద్ధాప్యంలో సాధారణ సమస్య అయిన చర్మంపై ముడతలను నివారిస్తుంది.
పింక్ గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్
పింక్ గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్‌లో లైకోపీన్ అనే కెరోటినాయిడ్ ఉంటుంది. ఇది మన చర్మానికి చాలా మేలు చేస్తుంది. వృద్ధాప్యం కారణంగా చర్మంపై ప్రభావం చూపకుండా చేస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
Also Read: Black Grapes Benefits: నల్ల ద్రాక్ష తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
Also Read: Wrinkles Home Remedies: ముఖంపై ముడతలు వస్తున్నాయా? అయితే వీటికి దూరంగా ఉండండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.