Corona Nasal Vaccine: కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ఇప్పుడు నాసల్ వ్యాక్సిన్‌పై అందరి దృష్టి నెలకొంది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో..నాసల్ స్ప్రేపై ఆశలు రేగుతున్నాయి.
కరోనా వైరస్‌కు కట్టడికై అభివృద్ధి చేస్తున్న నాసల్ వ్యాక్సిన్(Nasal Vaccine)పై అందరి దృష్టి నెలకొంది. నాసల్ వ్యాక్సిన్ ఆశాజనక ఫలితాలనిస్తోంది. జంతువులపై జరిపిన క్లినికల్ ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలు, ఫెర్రెట్లకు సింగిల్ డోస్ ఇచ్చారు. ఎలుకల్లో అయితే కరోనా నుంచి పూర్తి రక్షణ లభించింది.ఫెర్రెట్‌లలో కరోనా వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకుంది. జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన ఈ ప్రయోగ ఫలితాలు అందరిలో ఆశలు రేపుతున్నాయి. ఫ్లూ వ్యాధికి వ్యాక్సిన్ ఇచ్చినట్టే..జంతువులకు అందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు(Corona vaccines) విజయవంతమైనవే అయినా..మెజార్టీ ప్రజలు తీసుకోలేదని, సులభంగా వినియోగించే వ్యాక్సిన్ అవసరముందని జార్జియా యూనివర్శిటీ ప్రొఫెసర్ తెలిపారు. నాసల్ స్ప్రే మనుషులపై సత్ఫలితాలనిస్తే ఇక కరోనాను విజయవంతంగా అడ్డుకోవచ్చని చెప్పారు.నాసల్ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలని..సాధారణ రిఫ్రిజిరేటర్లలో మూడు నెలల వరకూ భద్రపర్చవచ్చని తెలుస్తోంది.
నాసల్ వ్యాక్సిన్ కోసం పరిశోధకుల పారా ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ను జంతువులపై ప్రయోగించినప్పుడు..ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ లభించింది. పీఐవీ 5 వైరస్..కరోనా వైరస్(Corona virus)లానే స్పైక్ ప్రోటీన్‌లను ఉపయోగించుకుని మానవ కణాల్లోకి చేరుతుంది. నాసల్ వ్యాక్సిన్ ముక్కు ద్వారా లోపలకు వెళ్లగానే..వాయునాళాల్లోని శ్లేష్మ పొరలో ఉన్న వైరస్ కణాల్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ముక్కు ద్వారా ఇచ్చిన వ్యాక్సిన్..ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపిస్తుంది.
Also read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook