Cucumber for Cholesterol: ఆహారాలు తినే క్రమంలో సలాడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఏ వంటకమైనా నోటికి ఇంపుగా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఈ సలాడ్స్ ను తీసుకుంటూ ఉంటారు. ప్రతి సలాడ్స్ లో దోసకాయను తప్పకుండా వినియోగిస్తారు. ఈ దోసకాయలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును వేగంగా తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా జీర్ణ క్రియ సమస్యలతో బాధపడేవారు ఈ సలాడ్స్ తో సులభంగా ఉపశమనం పొందవచ్చు.
దోసకాయతో చేసిన వంటకాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నవారు దీని నియంత్రించేందుకు ఎలా దోసకాయని వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయలను ఆహారంలో భాగంగా క్రమం తప్పకుండా వినియోగిస్తే శరీరంలోని కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కు బదులుగా హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలో గుండె సమస్యలు దూరం అవుతాయి. కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు దోసకాయను ఆహారంలో వినియోగించాలి.
బయట లభించే వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా కొంతమందిలో హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గుతుంది. ఇలాంటి అప్పుడు మీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించాల్సి ఉంటుంది. అయితే దీనికోసం తప్పకుండా ఆహారంలో దోసకాయలను వినియోగించాలి. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే పై సమస్యలు అన్నిటికి చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Adipurush 3D Teaser: 3డీలో ఆదిపురుష్ టీజర్.. జండూబామ్ అన్నారంటూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి