Curry Leaves Benefits: కరివేపాకుతో శరీరానికి చాలా ప్రయోజనాలు..ముఖ్యంగా ఈ వ్యాధుల వారికి చాలా మేలు..!!

 Curry Leaves Benefits: భారతీయ ప్రతి వంటలో కరివేపాకును వాడతారు. ఇది కూరలను రుచిగా చేయడమే కాకుండా శరీరానికి మంచి పోషక వివలను అందజేస్తాయి. దీనిని ఎక్కువగా  సౌత్ ఇండియన్ వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వీటిలో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు తోడ్పడుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 23, 2022, 01:16 PM IST
  • కరివేపాకుతో శరీరానికి చాలా ప్రయోజనాలు
  • కరివేపాకు కళ్లకు మంచిది
  • డయాబెటిస్‌ ఉన్న వారు నమిలి తినండి
 Curry Leaves Benefits: కరివేపాకుతో శరీరానికి చాలా ప్రయోజనాలు..ముఖ్యంగా ఈ వ్యాధుల వారికి చాలా మేలు..!!

Curry Leaves Benefits: భారతీయ ప్రతి వంటలో కరివేపాకును వాడతారు. ఇది కూరలను రుచిగా చేయడమే కాకుండా శరీరానికి మంచి పోషక వివలను అందజేస్తాయి. దీనిని ఎక్కువగా  సౌత్ ఇండియన్ వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వీటిలో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు తోడ్పడుతాయి. కరివేపాకును తినడం వల్ల వచ్చే ఇతర ప్రయోజనాలను తెలుసుకుందాం..

కరివేపాకు ఆరోగ్య నిధి:

కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, మెగ్నీషియం, విటమిన్లు వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 3 నుండి 4 పచ్చి ఆకులను నమిలి తింటే చాలా రకాల ప్రయోజనాలు వస్తాయని ఆయుర్వేద శాస్త్రం తెలుపుతుంది.

కరివేపాకు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:

1. కళ్లకు మంచిది:

కరివేపాకు తినడం ద్వారా  రాత్రి అంధత్వం, కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారు విముక్తి పొందవచ్చు.  ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.

2. డయాబెటిస్‌కు ఉపయోగపడుతుంది:

కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. దీనిని మధుమేహ రోగులు తరచుగా నమలి తినడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

3. జీర్ణక్రియ మెరుగుపరుచుతుంది:

కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తినాలి. ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యలు తొలగిపోతాయి.

4. సంక్రమణను నివారించడం:

కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారించి వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

5. బరువును తగ్గిస్తుంది:

కరివేపాలో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి. కావున దీనిని తినడం ద్వారా బరువు, పొట్ట కొవ్వు తగ్గిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Marigold benefits: బంతి పువ్వుతో వచ్చే ప్రయోజనాలు తెలిస్తే..మీరు ఆశ్చర్యపోతారు..!!

Also Read: Apple Peel Benefits: యాపిల్‌ను తొక్క తీసి తింటున్నారా..అయితే అలా తినకండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News