Navratri Healthy Food For Diabetes: నవరాత్రి ఉపవాస సమయంలో అమ్మవారికి వివిధ రకాల ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా దుర్గాదేవికి పూజలో భాగంగా పండ్లు, పాలతో చేసిన ఆహారాలను ఎక్కువగా అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా నైవేద్యాల్లో భాగంగా అమ్మవారికి ఇష్టమైన సబుదానా ఖీర్‌ను ఎక్కువగా భక్తలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే ఈ ఆ ఆహారాలను ఉపవాసాల్లో భాగంగా తీసుకుంటే శరీనికి ప్రయోజనాలు లభించడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. సబుదానా ఖీర్‌లో ఉపయోగించి పండ్లు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తాయి. అయితే నవరాత్రుల్లో ఈ ఖీర్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సబుదానా ఖీర్ ప్రయోజనాలు:
ఎముకలు బలంగా మారుతాయి:
సబుదానా ఖీర్‌లో వినియోగించి వస్తువుల్లో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, ప్రోటీన్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆధునిక జీవన శైలి కారణంగా వస్తున్న కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.
రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది:
డయాబెటిస్ సమస్యలతో బాధపడుతున్నవారికి సబుదానా ఖీర్ తీసుకుంటే శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాల స్థాలను సులభంగా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఉపవాసంలో భాగంగా ఈ ఖీర్‌ను తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఖీర్ తయారు చేసుకునే క్రమంలో కేవలం కొవ్వు తక్కువ పరిమాణాల్లో పాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
శరీరాన్ని యాక్టివ్‌గా చేస్తుంది:
సాబుదానా ఖీర్ తీసుకోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటీన్లు లభిస్తాయి. కాబట్టి ఈ ఖీర్‌ను ఉపవాసాల్లో భాగంగా తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా మారుతుంది.
ఈ ఖీర్‌ను ఎలా తయారు చేయాలి:
1. ముందుగా సాబుదానాను 1-2 గంటలు నానబెట్టండి.
2. తర్వాత పాలలో సాబుదానా వేసి బాగా మరిగించాలి.
3. దీన్ని బాగా వేడి చేసి కలుపుతూ ఉండండి. ఇందులో చక్కెర, డ్రై ఫ్రూట్స్ వేసి తీసుకోవచ్చు.
4. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook