Dark Circles: కంటి చుట్టూ నల్లని వలయాలకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. ప్రధాన కారణం నిద్ర సరిగ్గా లేకపోవడం. ఒత్తిడి, వయస్సు పెరగడం, అనారోగ్యం, జీన్స్ వంటివి ఇతర కారణాలు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు.
కంటి చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను నిర్మూలించేందుకు మార్కెట్‌లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటి వల్ల పూర్తిగా సమస్య పరిష్కారం కాదు సరికదా దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. అందుకే మార్కెట్ ఉత్పత్తులపై ఆధారపడకుండా కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
మొదటిది ఐస్ క్యూబ్ థెరపీ. ఇందులో 2-3 ఐస్ క్యూబ్స్‌ను మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టి కంటి కింద అప్లై చేసుకోవాలి. రోజూ ఉదయం లేవగానే క్రమం తప్పకుండా 15 నిమిషాలు చేస్తుండాలి. ఈ పద్ధతి మంచి ఫలితాలను ఇస్తుంది. రేండవది టీ బ్యాగ్స్ పద్ధతి. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ బ్యాగ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను మెరుగుపర్చి కంటి కింద నల్లని వలయాలను తొలగిస్తాయి. టీ బ్యాగ్స్‌ను వేడి నీటిలో ముంచి తరువాత ఫ్రిజ్‌లో చల్లబరచాలి. వీటిని కంటి కింద 15-20 నిమిషాలు ఉంచాలి.
టొమాటో, నిమ్మరసం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ పిగ్మంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. టొమాటో రసం ఒక స్పూన్ తీసుకుని అందులో నిమ్మరసం కలిపి కళ్ల కింద అప్లై చేయాలి. వారానికి 2-3 సార్లు చేస్తే మంచి ఫలితాలు గమనించవచ్చు. ఇక కీర దోసకాయ గురించి అందరికీ తెలిసిందే. చాలామంది ఈ పద్ధతి అవలంబిస్తుంటారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చర్మాన్నిహైడ్రేట్ చేస్తాయి. కంటి కింద డార్క్ సర్కిల్స్ సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది.
బాదం నూనెతో కూడా కంటి కింద నల్లని వలయాలను తొలగించవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఇ ఇందుకు దోహదం చేస్తుంది. చర్మానికి కావల్సిన పోషణ లభిస్తుంది. రోజూ రాత్రి వేళ రెండు చుక్కల బాదం నూనె తీసుకుని కంటి కింద మృదువుగా మస్సాజ్ చేసుకోవాలి. ఇక అందరికీ తెలిసిన మరో పద్థతి అల్లోవెరా. అల్లోవెరా చర్మం, కేశాల సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. అల్లోవెరా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. రాత్రి వేళ కంటి కింద రాస్తే మస్సాజ్ చేసుకోవాలి.
Also read: IPL 2025 SRH Matches: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి