Black Fungus in Maharashtra: కరోనా మహమ్మారి నుంచి కోలుకోకముందే బ్లాక్ ఫంగస్ దాడి తీవ్రమౌతోంది. మ్యూకోర్ మైకోసిస్ ప్రాణాంతకంగా మారింది. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ఉధృతి తీవ్రంగా ఉంది. రోగుల ప్రాణాలు గాలిలో కల్సిపోతున్నాయి.
కరోనా మహమ్మారి వైరస్ బారిన పడిన వారిలో బ్లాక్ ఫంగస్ (Black Fungus) ఏర్పడి ప్రాణాలను తీస్తోంది. దేశంలో ఇప్పటికే కరోనా కల్లోలం రేపుతుంటే ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బ్లాక్ ఫంగస్‌తో ఏకంగా 16 మంది మృత్యువాత పడ్డారు. మహారాష్ట్ర (Maharashtra) లోని ఔరంగాబాద్‌లో 201 మందికి ఆ ఫంగస్ సోకితే..అందులో 16 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
2021లో కరోనా కేసులు పరిశీలిస్తే..201 మందికి బ్లాక్ ఫంగస్ సోకిందని ఔరంగాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని అధికారులు ఓ నివేదికలో తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు గుర్తించేందుకు కరోనా బాధితుల వివరాలు పరిశీలించామని..కరోనా బాధితుల్లో స్టెరాయిడ్స్ వాడినవారు, మధుమేహ వ్యాధిగ్రస్థులకు బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని గుర్తించినట్టు వైద్య నిపుణులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలను ( Black Fungus Symptoms) గుర్తించి ప్రత్యేక వైద్యం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
Also read: Covid Medicine Release: మేకిన్ ఇన్ ఇండియా కోవిడ్ మెడిసిన్ 2 డీజీ విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook