Assam Election Manifesto: అస్సాం ఎన్నికలకు బీజేపీ ప్రచారాస్త్రం సిద్ధం చేసింది. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది.
అస్సాం క్షేమం కోసం జాతీయ పౌర పట్టికను పటిష్టంగా అమలు చేస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) స్పష్టం చేశారు. అస్సాం ఎన్నికల మేనిఫెస్టో(Election Manifesto)ను పార్టీ విడుదల చేసింది. నిజమైన భారతీయుల్ని కాపాడుకుంటామని..చొరబాటుదారుల్ని తరిమేస్తామని తెలిపారు. అస్సాం వాసుల్ని సురక్షితంగా ఉండమని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ముఖ్యమంత్రి సర్బనందా సోనోవల్ సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల చేశారు.
అస్సాం రాజకీయ హక్కులు కాపాడుతామని, చొరబాట్ల కట్టడిని వేగవంతం చేస్తామని జేపీ నడ్డా( Jp Nadda ) తెలిపారు. బ్రహ్మపుత్ర నదిపై అతిపెద్ద రిజర్వాయర్లు కడతామని మేనిఫెస్టోలో బీజేపీ హామీ ఇచ్చింది. రిజర్వాయర్‌తో వరదల నుంచి విముక్తి లభిస్తుందని తెలిపారు. 30 లక్షల కుటుంబాలకు నెలకు 3 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. అస్సాం స్వయం సమృద్ధి కోసం సూక్క్ష్మ, స్థూల ప్రణాళికలు అమలు చేస్తామని చెప్పారు. మరోవైపు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ఇందులో 2022 మార్చి 1లోపు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ప్రధానంగా బీజేపీ (BJP) హామీ ఇచ్చింది. ప్రైవేటు రంగంలో 8 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చింది. భూమి లేనివారికి పట్టా పద్ధతి అమలు చేస్తామని వెల్లడించింది.126 స్థానాలు ఉన్న అస్సాం అసెంబ్లీకి మూడు దశల్లో అంటే మార్చ్ 27 , ఏప్రిల్ 1, 6 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
Also read: COVID-19 Vaccine: కేంద్రం కీలక నిర్ణయం, 45 పైబడిన వారికి ఏప్రిల్ 1 నుంచి కరోనా టీకాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook