Bihar Election Result 2020 Update: పాట్నా: సర్వత్రా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Bihar Election Result) మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 243 స్థానాలున్న బీహార్‌లో తొలి ఫలితం సుమారు 10 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది. అయితే తుది ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యం జరిగే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కరోనా నిబంధనలతో కౌంటింగ్ ప్రక్రియ జరగనున్న నేపథ్యంలో కొంచెం ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు పేర్కొంటున్నారు. దీంతోపాటు ఓట్లతోపాటు వీవీపాట్‌ల స్లిప్పులను కూడా లెక్కించాల్సి ఉంటుంది. కావున తుది ఫలితాలు కొంచెం ఆలస్యమైనప్పటికీ ట్రెండ్స్ మాత్రం వెలువడనున్నాయి. Also read: Telangana: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లోని 55 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే 10 గంటలకల్లా ట్రెండ్స్ వెలువడే అవకాశముంది.
#BiharElection2020 The counting of votes for Bihar Assembly elections is underway at counting centre established at Anugrah Narayan College in Patna pic.twitter.com/nPfjLuzxxx
— ANI (@ANI) November 10, 2020
ఇదిలాఉంటే.. దేశంలోని 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అన్నిచోట్ల ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో 28 సీట్లకు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మద్యప్రదేశ్‌తోపాటు గుజరాత్‌లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1, తెలంగాణలో 1 (దుబ్బాక) ఉప ఎన్నికల ఫలితాలు కూడా మరి కాసేపట్లో వెలువడనున్నాయి.
Bihar Election Result: బీహార్ కింగ్ ఎవరు?.. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe