Fire in Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)లో అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి దిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు అలర్ట్ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
అసలేం జరిగిందంటే..
రాణి కమలాపతి - హజ్రత్ నిజాముద్దీన్ వందే భారత్ రైలు సోమవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో భోపాల్ నుంచి బయల్దేరింది. ఉదయం 6.45 గంటల ప్రాంతంలో సీ-12 బోగీ చక్రాల్లో నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే రైలును విదిశ జిల్లాలోని కుర్వాయ్ - కేథోరా స్టేషన్ల మధ్య నిలిపివేసి చెక్ చేశారు. బ్యాటరీ బాక్సుల్లో మంటలు (Fire in Battery Box) చెలరేగినట్లు గుర్తించిన రైల్వే సిబ్బంది .. వెంటనే ప్రయాణికులను దించేశారు.
VIDEO | A fire broke out in a coach of Vande Bharat Express going from Bhopal to Delhi's Hazrat Nizamuddin Terminal at Kurwai Kethora railway station in Madhya Pradesh earlier today. No injury was reported in the incident.
(Source: Third Party) pic.twitter.com/m1Nj0mHJ46
— Press Trust of India (@PTI_News) July 17, 2023
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మంటలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ట్రైన్ కు మరమ్మత్తులు చేస్తున్నారు. ఇవి పూర్తయిన తర్వాత రైలు ఢిల్లీ బయలుదేరుతుందని అధికారులు పేర్కొన్నారు. ఘటన సమయంలో సీ-12 బోగీలో 36 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి వందేభారత్ రైలు ఇదే కావడం విశేషం. దీనిని గత ఏప్రిల్ లో ప్రధాని మోదీ లాంచ్ చేశారు.
Also Read: Heavy Rains Alert: ఆ ఐదు రాష్ట్రాలకు ఆరెంజ్ ఎలర్ట్, రేపు అతి భారీ వర్షం తప్పదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook