CBSE Board Exams 2023: సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్ లీక్ వివాదంపై స్పందించిన బోర్డు

CBSE Board Exams 2023 Paper Leak: ఇప్పటికే సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయ్యాయని కొంతమంది.. తమ వద్ద లీకైన పేపర్స్ ఉన్నాయని ఇంకొంతమంది సామాజిక మాద్యమాల్లో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. 

Written by - Pavan | Last Updated : Feb 27, 2023, 06:12 PM IST
CBSE Board Exams 2023: సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్ లీక్ వివాదంపై స్పందించిన బోర్డు

CBSE Board Exams 2023 Paper Leak: సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్ లీక్ వివాదంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ స్పందించింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం జరుగుతోందని... అవాస్తవాలను ప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారవర్గాలు స్పష్టంచేశాయి. 

ఇప్పటికే సీబీఎస్ఈ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అయ్యాయని కొంతమంది.. తమ వద్ద లీకైన పేపర్స్ ఉన్నాయని ఇంకొంతమంది సామాజిక మాద్యమాల్లో కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. అలా సీబీఎస్ఈ బోర్డు ప్రతిష్ట దిగజారేలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నట్టుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు స్పష్టంచేశారు. 

కొంతమంది అదేపనిగా ఫేక్ న్యూస్ చెబుతూ ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సీబీఎస్ఈ 10వ తరగతి పేపర్స్, సీబీఎస్ఈ 12వ తరగతి పేపర్స్ లీక్ అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. తమ వద్ద లీక్ అయిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయని నమ్మించి కొంతమంది విద్యార్థలు లేదా వారి తల్లిదండ్రుల వద్ద డబ్బులు దండుకుని మోసం చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని సీబీఎస్ఈ తేల్చిచెప్పింది. కొంతమంది స్వార్థంతో చేసే ఈ పనుల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం, గందరగోళం నెలకొని ఉంటుందని బోర్డ్ అధికారులు అభిప్రాయపడ్డారు. 

ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వైరల్ చేస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు ఫిర్యాదు చేసినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హచ్చరించింది. స్టూడెంట్స్ ఇలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికిన సీబీఎస్ఈ బోర్డ్.. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇలాంటి అంశాల్లో ప్రోత్సహించొద్దని సూచించింది. లేదంటే ఐపిసి, ఐటి యాక్ట్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇది కూాడా చదవండి : CTET Result in ctet.nic.in 2023: CTET రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్.. ఎక్కడ చెక్ చేయాలో తెలుసా?

ఇది కూాడా చదవండి : 7th pay Commission News: 7వ పే కమిషన్ అమలు చేయకపోతే నిరవధిక ధర్నా.. ఉద్యోగ సంఘాల వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News