Security forces kill Maoists in Chhattisgarh: గత కొన్ని సంవత్సరాలుగా ఛత్తీస్గడ్ లోని మావోయిస్టులకు - భద్రతా దళాలకు మధ్య భీకర యుద్ధం జరుగుతూనే ఉంది . ఇప్పటికీ ఇలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగాయి కూడా. ఈ దాడుల్లో చాలామంది మావోయిస్టులు ప్రాణాలు సైతం కోల్పోయారు.అంతేకాదు మావోయిస్టుల కారణంగా భద్రత దళాలకు సంబంధించిన అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఇప్పుడు.. తాజాగా మరో భారీ ఎన్కౌంటర్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఎన్కౌంటర్లో ఏకంగా 36 మంది మరణించినట్లు సమాచారం అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. చత్తీస్ గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మావోయిస్టులు మృతి చెందారు.దంతే వాడ - నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మడ్ దగ్గర ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు స్పష్టం చేశారు.
ఎదురుకాల్పులు జరిగిన ఘటనా స్థలంలో పలు ఆయుధాలతో.. పాటు భారీగా పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లలో.. ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. అబూజ్ మడ్ దండకారణ్యంలో మావోయిస్టుల సంచరిస్తున్నట్లు సమాచారం అందగా దీంతో భద్రతా సిబ్బంది అలర్ట్ అయి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.
ఈ క్రమంలోనే శుక్రవారం అనగా ఈరోజు మధ్యాహ్నం భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరపగా.. అలర్టైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో 36 మంది మావోయిస్టు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుమారు గంట పాటు సాగిన ఈ భీకర యుద్ధం తర్వాత ఎన్కౌంటర్ స్థలం నుంచి 36 మంది మావోయిస్టుల మృతదేహాలు, ఏకే 47 రైఫిల్ , ఒక ఎస్ ఎల్ ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్), మందు గుండు సామాగ్రి , పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఆ ప్రాంతంలో ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది అని కూడా అధికారులు తెలిపారు. తాజా ఎదురుకాల్పుల ఘటనతో 2024లో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో 187 మంది మావోయిస్టులను భద్రత బలగాలు షూట్ చేశాయి. అంతేకాదు ప్రజలను నక్సలైట్ పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా ఇంత భీకర ఎన్కౌంటర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.
Also Read: Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter