రాహుల్ సార్‌తో నన్ను పోల్చడం హ్యాపీ: ప్రియా ప్రకాశ్

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Last Updated : Jul 21, 2018, 09:33 AM IST
రాహుల్ సార్‌తో నన్ను పోల్చడం హ్యాపీ: ప్రియా ప్రకాశ్

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీని ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాహుల్‌ తన స్థానంలో కూర్చొని సహచర నేతలను చూస్తూ కన్నుకొట్టారు. ఇలా కన్నుకొట్టడం.. సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు రాహుల్‌ కన్ను కొట్టడాన్ని ప్రియాప్రకాశ్ వారియర్‌తో పోల్చారు. మలయాళ చిత్రం ‘ఒరు అదార్‌ లవ్’ లో ఓ పాటలో ప్రియా కన్నుకొట్టడం.. సోషల్ మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే! ప్రియా వీడియోను లోక్‌సభలో రాహుల్ కన్నుకొట్టే వీడియోను జత చేస్తూ ఎక్కువ మంది కామెంట్లు పెట్టేశారు.

 

 

 

 

తాజాగా దీనిపై ప్రియా ప్రకాశ్‌ స్పందించింది. రాహుల్ సార్‌తో తనను పోల్చడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె  వెల్లడించింది.  ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను కాలేజి నుంచి ఇంటికి తిరిగి రాగానే మా అమ్మ ఈ విషయం గురించి చెప్పింది. నువ్వు మళ్ళీ పాపులర్ అయిపోయావ్ అంది. ప్రధాని మోదీ సార్ సభలో ఉండగా రాహుల్‌ సార్‌ కన్నుకొట్టారని..ఈ వీడియోను నీ వీడియోతో కలిపి టీవీల్లో చూపిస్తున్నారని చెప్పింది. రాహుల్ సార్‌తో నన్ను పోల్చడం సంతోషంగా ఉంది' అని  ప్రియా చెప్పింది. నాకీరోజు మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుందని.. మళ్ళీ చాలాకాలం తరువాత నా పేరు ఇంటర్నెట్‌లో సంచలనం అవుతోందని ప్రియా వ్యాఖ్యానించారు.

Trending News