ఇవాంకా ట్రంప్.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గారాలపట్టి. అంతే కాదు ఫ్యాషన్ కు మారు పేరు. ఆమె వేసుకునే దుస్తులే ఫ్యాషన్ క్రియేట్ చేస్తాయి. నిన్న గుజరాత్ లో అడుగుపెట్టగానే .. ఆమె వేసుకున్న డ్రెస్ పై చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ ఆమె వేసుకున్న డ్రెస్ ఏంటీ..? దాని ఖరీదు ఎంత..? ఎవరు డిజైన్ చేశారు..? ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో తలెత్తాయి.
ఇవాంక ట్రంప్ వేసుకున్న ఎర్ర పూల గౌను.. అమెరికాలోని ప్రొయేంజా షూలర్ అనే బ్రాండ్ కు చెందినది. లేత నీలి రంగుపై ఎర్ర పూలతో గౌన్ డిజైన్ చేశారు. దీని ఖరీదు అక్షరాలా లక్షా 70 వేల రూపాయలు. గతంలో 2019 సెప్టెంబర్ లో అర్జెంటీనా పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె ఈ గౌన్ ధరించారు. ఆ తర్వాత మళ్లీ భారత్ లో ఆ గౌన్ వేసుకుని అడుగు పెట్టారు.
Read Also:మోదీ, ట్రంప్ ఆత్మీయ ఆలింగనం
మరోవైపు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా భారతీయ సంప్రదాయాన్ని తన దుస్తుల్లో కనిపించే విధంగా చూసుకున్నారు. తెల్లని జంప్ సూట్ లో విమానం దిగిన ఆమె.. నడుముకు బంగారం అంచు ఉన్న ఆకుపచ్చని కండువా కట్టుకున్నారు. మెలానియా ట్రంప్ వేసుకున్న ఈ డ్రెస్ ను ఫ్రెంచ్, అమెరికన్ డిజైనర్ హెర్వ్ పియరీ రూపొందించడం విశేషం.