Lalu Prasad Yadav Health: పశువుల దాణా కుంభకోణానికి సంబంధించి నమోదైన ఐదు కేసుల్లోనూ లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలారు. ఇప్పటికే చైబాసా ట్రెజరీ, డియోఘర్ ట్రెజరీ, దుంకా ట్రెజరీ కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. ఇటీవలే డొరండా ట్రెజరీ కేసులోనూ దోషిగా తేలారు. డొరండా ట్రెజరీ కేసులో తాజాగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.60 లక్షలు జరిమానా విధించింది.
కోర్టు తీర్పుతో లాలూ ప్రసాద్ యాదవ్‌ను జార్ఖండ్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే లాలూ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయన్ను రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చేర్చారు. లాలూ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం కాస్త నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. లాలూ సుగర్ లెవల్స్, బీపీ తరచూ పడిపోవడం, పెరగడం జరుగుతోందన్నారు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ సమస్య కూడా ఉంది. ప్రస్తుతం ఆయన కిడ్నీలు 20 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తోందని వైద్యులు తెలిపారు. దీంతో లాలూ ఆరోగ్యంపై ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది.
దాణా కుంభ కోణం కేసులో లాలూ 2017 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా శిక్షా కాలంలో ఎక్కువ సమయాన్ని రిమ్స్ ఆసుపత్రిలోనే గడిపారు. అంతకుముందు, నాలుగు కేసుల్లో కలిపి లాలూ ప్రసాద్‌కు మొత్తం 14 ఏళ్ల పాటు జైలు శిక్ష పడింది. తాజాగా మరో కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. అయితే సీబీఐ కోర్టు ఇచ్చిన తాజా తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు.
Also Read: Bheemla Nayak Trailer Talk: ఆ ఒక్కటి ఫ్యాన్స్‌ను బాగా డిసప్పాయింట్ చేసిందా? ఆర్జీవీ రియాక్షన్ ఇలా..
Also Read: Bheemla Nayak Trailer: భీమ్లా నాయక్ ట్రైలర్.. పవర్ ప్యాక్డ్... ఫ్యాన్స్‌కు పూనకాలే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook