రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ 'మాన్ సూన్ హంగామా' పేరిట ఓ సరికొత్త ఆఫర్ ను ప్రకటించారు. తాజా ఆఫర్ ప్రకారం పాత జియో ఫోన్ తిరిగి ఇచ్చి సరికొత్త ఫీచర్స్ కలిగిన కొత్త ఫోన్ తీసుకోవచ్చు. అయితే అదనంగా రూ. 501 చెల్లించాల్సి ఉంది. జూలై 21 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ట్రయల్స్ పూర్తి చేసుకొని 'జియో ఫోన్ 2' ను ఆగస్టు 15 నుంచి కష్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఆఫర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు సంబంధిత వెబ్ సైట్ చూడవచ్చు.
గత సంవత్సరం పూర్తి రిఫండబుల్ డిపాజిట్ తో రూ. 1,500కే జియో ఫోన్ ను అందించిన విషయం తెలిసిందే. ఇది 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' గా మారి 2.5 కోట్ల మంది చేతుల్లోకి చేరింది . కాగా తాజా ప్రకటనతో మొబైల్ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
'జియో ఫోన్ 2' ఫీచర్స్ ..
తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్న ఈ 'జియో ఫోన్ 2' ఫీచర్స్ అదిరిపోయేలా ఉన్నాయి. క్వయిట్రీ కీ బోర్డు, డ్యూయల్ సిమ్, 2.4 అంగుళాల స్క్రీన్ 128 జీబీ వరకూ ఎస్డీ కార్డు సపోర్టు, రెండు కెమెరాలు, 512 ఎంబీ రామ్, 4 జీబీ రామ్, వైఫై దీని ప్రత్యేకతలు. చౌకధరలో లభిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ జియో ఫోన్ లో ఫేస్ బుక్, వాట్స్ యాప్, యూ ట్యూబ్ లు అందుబాటులోకి రానున్నాయి.