PM Modi quits Weibo: చైనాకు పీఎం మోడీ మరో ఝలక్

చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు.

Last Updated : Jul 1, 2020, 08:15 PM IST
PM Modi quits Weibo: చైనాకు పీఎం మోడీ మరో ఝలక్

PM Narendra Modi: న్యూఢిల్లీ: భారతదేశంలో చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన తరువాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబో ( Weibo ) నుంచి వైదొలిగారు. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. వీబోలో ప్రధాని మోడీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీబోలో ప్రధాని మోడీ 115 పోస్టులు పోస్ట్ చేశారు. కాగా వాటిని మాన్యూవల్‌గా తొలగించాలని నిర్ణయించుకుని ఇప్పటికే 113 పోస్టులను డిలీట్ చేశారు. ఇంకా మరో రెండు పోస్టులు మిగిలి ఉండగా.. తాజాగా వాటిని కూడా తొలగించారు. ( Also read: Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై కేంద్రం నిషేధం )

ఆ రెండు పోస్టుల్లో చైనా అధ్యక్షుడితో..
అయితే మిగిలిన రెండు పోస్టుల్లో ప్రధాని మోడీ ( PM Modi ), చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ( Xi Jinping ) తో ఉన్న చిత్రాలు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు, ప్రధాని మోడీ ఉన్న పోస్టును తొలగించడం తమకు కష్టమని వీబో యాప్ యాజమాన్యం భారత్‌కి చెందిన సంబంధిత అధికారులకు తెలియజేసింది. దీంతో వీటిని తొలగించడానికి కొంత సమయం పట్టిందని తెలుస్తోంది. వీఐపీ ఖాతాలను వీబో నుంచి వైదొలగడానికి చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని, అందుకే కొంత సమయం పట్టినట్లు సమాచారం. ప్రధాని వీబో నుంచి వైదొలిగే ప్రక్రియ చాలా కాలం క్రితమే ప్రారంభమైనా.. చైనా అందుకు అనుమతి ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని చెబుతున్నారు. ( Also read: 
Chinese apps banned: చైనా యాప్స్‌ నిషేధం.. స్పందించిన చైనా సర్కార్ )

భారత్‌లో చైనాపై ఆగ్రహ జ్వాలలు..
లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డ నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అప్పటినుంచి దేశంలో చైనా వస్తువులను, చైనా యాప్‌లను బహిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. అదే సమయంలో దేశ రక్షణకు భంగం కలిగించేలా ఉన్న 59 మొబైల్ యాప్స్‌ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here.. 

Trending News