Flax Seeds For Hair: ఎలాంటి జుట్టు సమస్యలైనా సరే.. ఈ హెయిర్ మాస్క్‌తో మటు మాయం..

Flax Seeds For Hair: వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అవిసె గింజలతో తయారు చేసిన హెయిర్ జెల్, హెయిర్ మాస్క్ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2023, 03:02 PM IST
 Flax Seeds For Hair: ఎలాంటి జుట్టు సమస్యలైనా సరే.. ఈ హెయిర్ మాస్క్‌తో మటు మాయం..

Flax Seeds For Hair: అందమైన జుట్టు పొందడం ప్రతి ఒక్కరి కోరిక.. చక్కటి, దృఢమైన జుట్టు ముఖానికి అందాన్ని ఇస్తుంది. అయితే ప్రస్తుతం కాలుష్యం, శరీరంలో పోషకాహార లోపం వల్ల జుట్టు బలహీనంగా తయారవుతోంది. దీని కారణంగా పొడవాటి జుట్టు కనిపించడం కష్టంగా మారింది. జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ  వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాల్లో అవిసె గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అందమైన జుట్టును పొందడానికి అవిసె గింజలను ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అవిసె గింజల వల్ల కలిగే ప్రయోజనాలు:
అవిసె గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. అందాన్నిపెంచేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టు పెరుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తాయి.

అవిసె గింజల హెయిర్ జెల్:
అవిసె గింజలను హెయిర్ మాస్క్‌గా కూడా వినియోగించవచ్చు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాలుగా ఉపయోగపడుతాయి. అయితే దీని కోసం ముందుగా విత్తనాలను నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచండి. వాటిని ఉదయం పూట మరిగించి..చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయండి.  అయితే దీనిని మళ్లీ మిశ్రమంగా తయారయ్యే దాకా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది.

ఫ్లాక్స్ సీడ్ హెయిర్ మాస్క్:
ఫ్లాక్స్ సీడ్స్ నుంచి తయారుచేసిన హెయిర్ మాస్క్‌లు జుట్టుకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. అవిసె గింజల పొడిని తయారు చేసి, అరటిపండు, పెరుగు, తేనె వంటి వాటితో కలిపి హెయిర్ మాస్క్‌లా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న హెయిర్ మాస్క్ దెబ్బతిన్న జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేస్తే జుట్టుకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

అవిసె నూనె:
అవిసె గింజల నూనె జుట్టును దృఢంగా తయారు చేయడానికి చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. షాంపూ చేయడానికి ముందు జుట్టుకు లిన్సీడ్ నూనెను అప్లై చేయండి. ఇలా ప్రతి రోజూ చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News