Gram Flour Face Pack: ప్రతి ఒక్కరు అందంగా కనిపించేందుకు మెరుపైన, మచ్చలేని చర్మం పొందేందుకు మార్కెట్లో లభించే అనేక రకాల రసాయనాలతో కూడిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించడం వల్ల భవిష్యత్తులో తీవ్ర చర్మ సమస్యలు రావడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా న్యాచురల్ గా లభించే కొన్ని వస్తువులను ఉపయోగించి కూడా చర్మాన్ని మెరిసేలా పొందవచ్చు.
శనగపిండితో తయారుచేసిన ఫేస్ మాస్క్ చర్మానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ శనగపిండి ఫేస్ మాస్కులు ఎలా తయారు చేయాలో దీనికి కావలసిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపిండి ఫేస్ మాస్క్ తయారీ విధానం:
ముందుగా ఓ చిన్న బావులు తీసుకోవాల్సి ఉంటుంది అందులో నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల తేనెను వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 నిమిషాల పాటు పక్కన పెట్టి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇలా ముఖానికి వారానికి మూడు నుంచి నాలుగు సార్లు అప్లై చేసుకుంటే మీరే ఫలితాన్ని పొందడం గమనించవచ్చు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
బొప్పాయి, శనగ పిండి:
బొప్పాయి శనగపిండి ఫేస్ మాస్క్ కూడా ముఖం పై ఉన్న చర్మానికి ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఫేస్ మాస్క్ ను తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు బొప్పాయి పండు మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అందులోనే రెండు టీ స్పూన్ల శెనగపిండిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ తేనెను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 20 నిమిషాల పాటు పక్కనపెట్టి ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ముఖానికి అప్లై చేసుకున్న తర్వాత దాదాపు 40 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందడమే కాకుండా ముఖంపై ఉన్న నల్ల మచ్చలు దూరమవుతాయి.
పసుపు, శనగ పిండి స్క్రబ్:
పసుపు, శనగపిండితో తయారుచేసిన ఫేస్ స్క్రబ్ కూడా ప్రభావంతంగా చర్మానికి సహాయపడుతుంది. అయితే దీనిని తయారు చేసుకోవడానికి ముందుగా రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలుపుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకొని అందులోనే మూడు టీ స్పూన్ల తేనెను కలుపుకొవాలి. చేసిన తర్వాత అరగంట పాటు పక్కనపెట్టి ముఖానికి అప్లై చేస్తే 15 రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook