Healthy lifestyle: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా మనలో చాలా మంది జిమ్ కు వెళ్లే టైం లేక ఇబ్బంది పడుతుంటారు. టైట్ షెడ్యూల్ , ఉద్యోగ బాధ్యతలు, పిల్లలు,ఇంటి బాధ్యతలు ఇలా గృహణులకైనా, ఉద్యోగాలు చేసే వాళ్ళకైనా సమయం దొరకడం లేదు. మనం ఎక్సర్సైజ్ చేసేది కేవలం సన్నగా మారడానికి మాత్రమే కాదు బాడీని ఫ్లెక్సిబుల్ గా..చురుకుగా ఉంచుకోవడానికి. వయసు పై పడే కొద్ది మనల్ని పీడించే ఎన్నో సమస్యలకు వ్యాయామం మంచి పరిష్కారం.
జీవితంలో స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే వ్యాయామం కూడా ఒక మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్, రక్తపోటు ,గుండెపోటు, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలు మన దరి చేరకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా రోజు ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగని రోజు జిమ్ కి వెళ్లే వసతి అందరికీ ఉండదు అలాంటి వారి కోసం ఈ కింది చిట్కాలు..
మెట్లు:
మన ఇంట్లో ఉన్న మెట్లు మనకు గొప్ప వ్యాయామ సాధకాలు అన్న విషయం చాలామందికి తెలియదు. తరచూ మెట్లు ఎక్కి దిగడం వల్ల మోకాళ్లలో గుజ్జు అరిగిపోతుందని కొందరు భావిస్తారు.అయితే అది కరెక్ట్ కాదు. మెట్లు ఎక్కి దిగడం వల్ల కాళ్ళు బలంగా అవ్వడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలు, కీళ్లు బలపడి దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ లిఫ్ట్ ను వాడకుండా ఓ రెండు మూడు అంతస్తులు ఎక్కి దిగడం అలవాటు చేసుకుంటే సరిపోతుంది.
స్కిప్పింగ్
బరువు తగ్గాలి అనుకునే వారికి స్కిప్పింగ్ ఒక సులువైన మార్గం. స్కిప్పింగ్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు సులభంగా బర్న్ అవుతాయి. రోజు స్కిప్పింగ్ చేసేవారు ఎముకల డెన్సిటీ పెరుగుతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మొదట తక్కువ కౌంట్ తో మొదలుపెట్టి క్రమంగా కౌంట్ పెంచుకుంటూ వెళ్తే స్కిప్పింగ్ ఎక్ససైజ్ లాగా కాకుండా ఇంట్లో వాళ్ళు సరదాగా ఆడుకున ఆటలాగా ఉంటుంది.
లెగ్స్ అప్ ది వాల్
లెగ్స్ అఫ్ ది వాల్ ఎక్ససైజ్ చేయడం వల్ల కాళ్ళ కు సంబంధించిన పలు రకాల నొప్పులు తగ్గుతాయి. ఇది చేయడం చాలా సులభం కూడా.. ఏ వయసు వారు అయినా ఇది ఎక్ససైజ్ని ఇంటి వద్ద చేసుకోవచ్చు. కాళ్ళ లో రక్తప్రసరణ వేగవంతం చేసి కాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి తగ్గించడంలో ఈ వ్యాయామం తోడ్పడుతుంది.
డ్యాన్స్
డాన్స్ చేయడం వల్ల బరువు తగ్గడమే కాదు మనసు ఉల్లాసంగా ఉంటుంది. శరీరంలో స్ట్రెస్ తగ్గడంతో పాటు మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఇండియన్ ,వెస్ట్రన్ ఏదైనా సరే.. నీకు వచ్చిన డాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.
Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి