Raw VS Ripen Papaya: పచ్చి లేదా పండిన బొప్పాయి.. జుట్టులో చుండ్రు తగ్గించే ఆరోగ్యంగా పెంచేది ఏది?

 Raw VS Ripen Papaya For Hair Growth: బొప్పాయిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. పండినా లేదా పచ్చి రెండిటిలో ఏ బొప్పాయి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది? ఎందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి..

Written by - Renuka Godugu | Last Updated : Feb 16, 2025, 11:04 AM IST
 Raw VS Ripen Papaya: పచ్చి లేదా పండిన బొప్పాయి.. జుట్టులో చుండ్రు తగ్గించే ఆరోగ్యంగా పెంచేది ఏది?

Raw VS Ripen Papaya For Hair Growth: బొప్పాయిలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. ఇందులో జీర్ణ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడతాయి.. ఇందులోని ప్రోటీన్స్ జుట్టు పెరుగుదలకు తోడ్పడి బలంగా మారుస్తాయి.. అయితే పండినా లేదా పచ్చి రెండిటిలో ఏ బొప్పాయి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి? పూర్తి వివరాలు ఇవే..

 కుదుళ్ల ఆరోగ్యం..
పచ్చి బొప్పాయిలో ఎంజైమ్‌ ఆరోగ్యకరమైన కుదుళ్లకు ప్రేరేపిస్తుంది.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి.. కుదుళ్లపై ఉండే వ్యర్ధాలను తొలగిస్తాయి.. అంతేకాదు అతిగా ఉండే ఆయిల్స్ ని కూడా గ్రహిస్తుంది. చుండ్రు సమస్యకు చెక్‌ పెడుతుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది.

పచ్చి బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌ పప్పెయిన్‌ అంటారు. ఇది ప్రోటీన్స్ విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్‌ కాకుండా ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఖనిజాలను కూడా గ్రహిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో అవసరం..

ఇక పచ్చి బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన హెయిర్ ఫాలికల్‌కు మంచి పోషణ అందించి జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.. ఇందులోని విటమిన్ ఏ సెబం ఉత్పత్తిని నివారిస్తుంది. దీంతో మనం జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది చుండ్రును నివారిస్తుంది.

పచ్చి బొప్పాయి పేస్ట్‌ తయారు చేసుకుని కుదుళ్ల నుంచి చివర్ల వరకు మొత్తం అప్లై చేసి ఓ అరగంట తర్వాత సాధారణ గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.

పండిన బొప్పాయి..
పండిన బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది హెయిర్ డ్యామేజ్ కాకుండా జుట్టును కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర యూవి కిరణాల నుంచి కాపాడుతుంది. దీంతో మన జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది..

పండిన బొప్పాయి వల్ల జుట్టుకు హైడ్రేషన్ అందుతుంది. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల పొడిబారి సమస్యను తగ్గిస్తుంది. జుట్టు సమస్యలు కూడా రావు, జుట్టుకు మంచి మాయిశ్చర్ అందిస్తుంది.

ఇదీ చదవండి: ఇవి విటమిన్‌ B12 పండ్లు, కూరగాయలు.. తింటే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

పండిన బొప్పాయిలో పప్పెయిన్‌ ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరుగుదలకు తోడ్పడుతుంది. హెయిర్ ఫాల్ సమస్యకు చక్కని రెమెడీ. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. పండిన బొప్పాయిని పేస్ట్ తయారు చేసుకుని ఇందులో తేనే లేదా యోగర్ట్‌ వేసి కలిపి జుట్టు అంతటికీ అప్లై చేయాలి. ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేయడం వల్ల ఇది జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. దీంతో జుట్టు చుండ్రు లేకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది..

పచ్చి లేదా పండిన రెండిట్లో ఏది బెట్టర్?
పచ్చి బొప్పాయి, పండిన బొప్పాయి పండ్లు రెండూ ఆరోగ్యకరం. ఇది జుట్టును ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అయితే మీకు చుండ్రు రాకుండా ఫోలికలు ఆరోగ్యంగా ఉండాలి అంటే  పచ్చి బొప్పాయిని జుట్టుకు అప్లై చేయడం.. పండిన బొప్పాయితోమీ జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మంచి పోషణ అందుతుంది. పండిన బొప్పాయిని డైట్ లో చేర్చుకోవాలి.. దీంతో జుట్టు బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది..

ఇదీ చదవండి: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. మే నెల దర్శనం టిక్కెట్లు, గదులను వెంటనే బుక్‌ చేసుకోండి..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News