King Kobra Viral Video: మీరు గతంలో పాములు సయ్యాట ఆడడం చూసే ఉంటారు.. మిగతా జీవులను తినడం చూసి ఉంటారు. కానీ అదే పాము తనను తినడం చూశారా..? లేదు కదా. అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. గోడలోకి దూరిన పాము కోపంతో తనను తాను తినేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గోడలో దూరిన పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా తీవ్ర ఆక్రోశంలో పాము బుసలు కొడుతూ తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న వీడియో భయోత్పాతానికి గురి చేసింది. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మురళీవాలే హౌస్లా అనే యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది.
ఓ వ్యక్తి రేకుల ఇంట్లో నివసిస్తున్నాడు. తన ఇంట్లో పాములు ఉన్నాయని ఓ స్నేక్ సొసైటీ సభ్యుడికి సమాచారం ఇచ్చాడు. పాములతో తాను ఇంట్లో ఉండేందుకు భయం అవుతుందని అతడు వాపోయాడు. పాముల బెడద తొలగించాలని కోరాడు. దీంతో స్నేక్ సొసైటీ సభ్యుడు ఒకరు వచ్చి ఇంటిని పరిశీలించాడు. పాములు ఇటుకలో మధ్యలో నివసిస్తున్నాయని గుర్తించాడు. ఇంటి లోపల టార్చ్ లైట్ వేసి చూడగా పాములు కనిపించాయి. వెంటనే బయటకు ఇంటి గోడ కూల్చగా నాగుపాములు బుసలు కొడుతూ బయటకు వచ్చాయి. దాదాపు పది అడుగులకు పైగా పాము ప్రత్యక్షమవడంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. ఓ ప్రత్యేక కర్ర ద్వారా పాములను స్నేక్ సొసైటీ సభ్యుడు నియంత్రణ చేశాడు. ఆ కర్ర ద్వారా పాములను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయగా పాములు బయటకు రాకుండా అక్కడే తిష్ట వేశాయి. అయితే కర్ర ద్వారా బలవంతంగా బయటకు తీయగా పాము తీవ్ర ఆగ్రహాంతో తోటి పామును పెద్దగా నోరు తెరచి కరచివేసింది.
పట్టుకునేందుకు వచ్చిన వారిపై పాములు బుసలు కొట్టాయి. అనంతరం అతి కష్టంగా ఆ పాములను స్నేక్ సొసైటీ సభ్యుడు బంధించాడు. రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని కనిపించాయి. ఎర్రటి సంచిలో ఆ వ్యక్తి పాములను బంధించి దగ్గరిలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అయితే ఈ పామును పట్టుకోవడానికి గ్రామస్తులు ఆసక్తిగా గమనించారు. పాములు బుసలు కొడుతున్నప్పుడు తీవ్ర భయాందోళన చెందారు.
ఈ దృశ్యాలను ప్రజలు తమ సెల్ ఫోన్‌లలో బంధించారు. కాగా తమ గ్రామంలో తరచూ పాములు సంచరిస్తున్నాయని.. మరికొన్ని చోట్ల కూడా పాములు ఉన్నాయని వాటిని బంధించాలని గ్రామస్తులు కోరారు. కాగా విష సర్పాలు కూడా ప్రాణం ఉన్న జీవులేనని.. వాటికి మనుషుల మాదిరి నొప్పి, బాధ అనేవి ఉంటాయని స్నేక్ సొసైటీ సభ్యుడు తెలిపాడు. తమ జీవనానికి ఆటంకం కలిగితే అవి తమలోని విషాన్ని విసర్జిస్తాయని వివరించాడు. తమకు ఎక్కడ హాని చేస్తారో అనే భయంతో సర్పాలు మనపై విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తాయని, అంతేకానీ పాములకు కక్ష.. పగ అనేవి ఉండవని ఆయన గ్రామస్తులకు అవగాహన కల్పించాడు. పాములు కనిపిస్తే వాటిని చంపొద్దని.. తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.