10 Feet King Cobra Hiding Under Car: ప్రస్తుతం విష సర్పాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు పాములను పట్టుకునే స్నేక్ క్యాచర్స్ షేర్ చేసిన వీడియోలను ఎక్కువగా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే స్నేక్ క్యాచెస్ కూడా వారు పెద్ద పెద్ద పాములను పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇంత వైరల్ కావడానికి కారణాలేంటో.. అసలు ఆ వీడియోలో ఏముందో మనం ఇప్పుడు చూద్దాం.
వీడియో వివరాల్లోకి వెళితే.. కారు కింది భాగమైన బంపర్ లో పాము ఉండడం గమనించి.. కారు యజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తాడు. దీంతో స్నేక్ క్యాచర్ వెంటనే అక్కడికి చేరుకొని కారు కింది దాగివున్న పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆ భారీ కింగ్ కోబ్రా బుసలి కొడుతూ కాటేసే ప్రయత్నం కూడా చేస్తుంది. స్నేక్ క్యాచర్ తన స్టిక్ ని వినియోగించి ఎంతో చాకచక్యంగా పట్టుకుంటాడు. ఇలా పట్టుకున్న తర్వాత ఓ నల్ల బ్యాగులో ఆ భారీ కింగ్ కోబ్రా ను బంధిస్తాడు. ఆ తర్వాత ఈ పామును సురక్షితమైన ప్రాంతంలో స్నేక్ క్యాచర్ వదిలేస్తాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook