Horoscope Today August 26th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి బలహీన స్థితిని చూసి ప్రత్యర్థులు రెచ్చిపోయే ఛాన్స్..

Horoscope Today August 26th 2022: ఇవాళ శుక్రవారం. హిందువులు శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం అష్ట ఐశ్వర్యాలను తీసుకొస్తుందని విశ్వసిస్తారు. ఈ శుక్రవారం గ్రహాల గమనం వ్యక్తుల జాతకంపై ఎలాంటి ప్రభావం చూపనుంది.. ఏయే రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 06:36 AM IST
  • ఇవాళ శుక్రవారం.. శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు
  • లక్ష్మీ దేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి
  • ఈ శుక్రవారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today August 26th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారి బలహీన స్థితిని చూసి ప్రత్యర్థులు రెచ్చిపోయే ఛాన్స్..

Horoscope Today August 26th 2022: ఇవాళ శుక్రవారం. హిందువులు శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం అష్ట ఐశ్వర్యాలను తీసుకొస్తుందని విశ్వసిస్తారు. ఈ శుక్రవారం గ్రహాల గమనం వ్యక్తుల జాతకంపై ఎలాంటి ప్రభావం చూపనుంది.. ఏయే రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేష రాశి (Aries)

చంద్ర అనుగ్రహం లభిస్తుంది. తోబుట్టువుల నుంచి శుభవార్త అందే సూచనలున్నాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ప్రాధాన్యతనిస్తారు. మీ ఇంటిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మీ క్రియేటివిటీకి పదును పెడుతారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కొత్త బిజినెస్ కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. అది సమీప భవిష్యత్తులో మీకు మంచి లాభాలు తీసుకొస్తుంది. ఆఫీసులో మీ కొలిగ్స్ మీరు చేపట్టిన ప్రాజెక్టుకు అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

వృషభ రాశి (Taurus)

ఇవాళ నెగటివిటీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. చేపట్టిన పనులేవీ ముందుకు సాగవు. మూడ్ స్వింగ్స్ బారినపడుతారు. మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురవుతాయి. చిన్న చిన్న తప్పిదాలు గందరగోళంలోకి నెట్టుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేయడంలో అవి మిమ్మల్ని కన్ఫ్యూజన్‌లో పడేస్తాయి.ప్రేమికులు కూడా ఒక కన్ఫ్యూజన్ స్థితిని ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది.

మిథున రాశి (GEMINI)

మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృత్తిపరంగా మరింత శక్తి సామర్థ్యాలతో పనిచేస్తారు. మీ సహోద్యోగుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులు లేదా మీ నెట్‌వర్క్ సాయంతో కొత్త వెంచర్స్ మొదలుపెడుతారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పని ఒత్తిడిలో పడి విశ్రాంతి మరిచిపోవద్దు. లేనిపక్షంలో అనారోగ్యం బారినపడుతారు.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ చంద్రుడి నెగటివ్ ప్రభావం మీపై పడుతుంది. మీరు చేపట్టిన పనుల నుంచి దృష్టి మళ్లుతుంది. అనవసర ఖర్చులు పెరుగతాయి. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఇది ఇంట్లో గొడవలకు దారితీస్తుంది. మీ బలహీన పరిస్థితిని చూసి ప్రత్యర్థులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యర్థులు లేదా శత్రువులపై ఎప్పుడూ కన్నేసి ఉంచండి. ఏ ఒప్పందంపై సంతకం చేసినా డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా చదవండి.

సింహ రాశి (LEO)

చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. చుట్టూ ఉన్న వ్యక్తులను గౌరవిస్తారు. అందరితో మర్యాదపూర్వకంగా మాట్లాడుతారు. మీ మంచితనం కారణంగా మీరు ఏ పనిచేసినా ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ సేవింగ్స్ పెరుగుతాయి. ఇంటి పునర్నిర్మాణానికి ప్లాన్ చేస్తారు.

కన్య రాశి (Virgo)

చంద్రుడి పాజిటివిటీ మీపై ఉంటుంది. చేపట్టిన పనేదైనా ఆస్వాదిస్తారు. మీ కృషికి తగిన ఫలితం ఏదో ఒక రూపంలో దొరుకుతుంది. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. పని భారం, ఎక్కువ గంటలు పనిచేయడం మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. కొన్ని ఫ్యామిలీ ఈవెంట్స్‌లో పాల్గొనలేకపోతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవడం గొప్ప ఊరట కలిగిస్తాయి.

తులా రాశి (Libra)

మీపై చంద్ర అనుగ్రహం ఉంటుంది. చేపట్టిన పని సంతృప్తినిస్తుంది. బిజినెస్ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. మీ పెద్దలు మీకు సరైన దారిని చూపిస్తారు. అది లక్ష్యం విషయంలో మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. మిమ్మల్ని మీరు మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారు.

వృశ్చిక రాశి (Scorpio)

చంద్రుడి నెగటివ్ ప్రభావం మిమ్మల్ని వెంటాడుతుంది. ఈరోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. అయినప్పటికీ మీ మైండ్‌ను కూల్‌గా ఉంచుకోవాలి. ఏ పని చేపట్టే ముందైనా ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించాలి. మీకు రావాల్సిన డబ్బును రికవరీ చేసుకునేందుకు ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. అడ్వెంచర్ టూర్స్‌కి దూరంగా ఉండండి. సక్సెస్ కోసం స్టూడెంట్స్ చదువుపై మరింత డీప్‌గా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ మీకు అన్నివిధాలా అనుకూలిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రభావశీలురైన వ్యక్తులతో పరిచయం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. వృత్తిపరంగా కొన్ని ప్రయోజనాలు పొందుతారు. జాబ్‌లో ఉన్నవారు బాగా రాణిస్తారు. ప్రమోషన్స్ లేదా రివార్డులు దక్కుతాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాలు తొలగిపోతాయి.

మకర రాశి (Capricorn) 

చంద్రుడి పాజిటివిటీ మీపై ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యంపై ఏకాగ్రత చెదరదు. పనిలో మీ పెర్ఫామెన్స్ బాగుంటుంది. మీ పని పట్ల మీ బాస్ చాలా హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. ఆఫీసులో కొన్ని ముఖ్య బాధ్యతలు చేపడుతారు. న్యాయపరమైన అంశాల్లో గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులు ప్రస్తుతానికి మీ జోలికి రారు.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మీరు చాలా ఇంటలెక్చువల్‌గా వ్యవహరిస్తారు. మీ జ్ఞానం మీ పట్ల అందరిలో గౌరవాన్ని ఏర్పరుస్తుంది. ఇంటలెక్చువల్ అసెట్స్ విలువ ఏంటో మీకు తెలిసొస్తుంది. సంపాదనకు ఢోకా ఉండదు. స్థిరమైన ఆదాయం ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రేమికులు హ్యామీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు.

మీన రాశి (Pisces) 

ఇవాళ మిమ్మల్ని ప్రతికూలతలు చుట్టుముడుతాయి. నెగటివ్ వైబ్రేషన్స్ వెంటాడుతాయి. చేపట్టిన బాధ్యతలను భారంగా ఫీలవుతారు. టాస్క్‌లను పూర్తి చేసేందుకు తొందరపడుతారు. ఈ క్రమంలో తప్పిదాలు జరుగుతాయి. అవి మీ పనిని మరింత ఆలస్యం చేస్తాయి. చేపట్టిన ప్రాజెక్టులేవీ సకాలంలో పూర్తి కావు. మీ సన్నిహితులు లేదా పెద్దల సలహాలతో నెగటివ్ పరిస్థితుల నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీనిని ధృవీకరించలేదు.)

Also Read: The Ghost Trailer: అంచనాలు పెంచ్తేస్తున్న ది ఘోస్ట్ ట్రైలర్!

Also Read: Deepak Chahar BCCI: ఆ వార్తల్లో నిజం లేదు.. దీపక్‌ చహర్‌ జట్టుతోనే ఉన్నాడు: బీసీసీఐ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News