Rahu And Ketu Transit: రాహు కేతువుల నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్.. ఇక డబ్బుల వర్షమే..

Rahu And Ketu Transit 2025: మార్చి 16వ తేదీన 6 గంటల సమయంలో రాహు కేతు గ్రహాలు పూర్వభద్రపాద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారిపై అరుదైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావంతో వారు అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలు పొందగలుగుతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 10, 2025, 11:25 PM IST
Rahu And Ketu Transit: రాహు కేతువుల నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్.. ఇక డబ్బుల వర్షమే..

Rahu And Ketu Transit Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలానికి అనుగుణంగా అన్ని గ్రహాలు ఏదో ఒక సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రానికి తప్పకుండా సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా సంచారం చేయడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇలా సంచారం చేసినప్పుడు గ్రహాన్ని బట్టి రాశుల వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. 

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాన్ని బట్టి రాశుల వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ గ్రహం అయితే శక్తి, బలమైన గ్రహంగా పరిగణిస్తారు ఆ గ్రహం సంచారం చేసినప్పుడు వ్యక్తిగత జీవితాల్లో ఊహించని అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే రాహు లాంటి కొన్ని కీడు గ్రహాలు సంచారం చేసినప్పుడు అప్పుడప్పుడు మంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల ప్రభావం పడుతూ ఉంటుంది. 

ఇదిలా ఉంటే మార్చి 16వ తేదీన ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాహు కేతువులు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. ఈ రెండు గ్రహాలు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పూర్వ భాద్రపాద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాయి. దీంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండు గ్రహాలకు నక్షత్ర మార్పుల కారణంగా ఏయే రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.

కర్కాటక రాశి
పూర్వభాద్రపాద నక్షత్రంలోకి రాహు కేతు గ్రహాలు ప్రవేశించడం వల్ల ముఖ్యంగా కర్కాటక రాశి వారి జీవితాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. వీరికి జీవితంలో సానుకూలత పెరిగి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ధైర్యంతో పాటు ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులతోపాటు బోలెడు సత్కారాలు లభిస్తాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే వీరికి సంపూర్ణ ఆరోగ్యం లభించి.. కాస్త దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. 

మేషరాశి 
మేష రాశి వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. రెండు శక్తివంతమైన రాహు కేతు గ్రహాలు మార్చి 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు నక్షత్ర సంచారం వల్ల మేష రాశి వారి జీవితం పూర్తిగా మారుతుంది. వీరికి జీవితంలో అనుకూలత ఎంతో పెరగబోతోంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త పదవులు లభించడమే కాకుండా మంత్రుల సపోర్టు లభిస్తుంది. ఇక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త ఆఫర్స్ వస్తాయి. ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నవారు పదోన్నతులు పొందగలుగుతారు. అంతేకాకుండా డబ్బులు సంపాదించేందుకు కొత్త కొత్త మార్గాలతో జీవితాన్ని ముందుకు నడుపుతారు. 

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

తులా రాశి
తులా రాశి వారికి కూడా ఈ సమయంలో ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రాహు కేతువుల అనుగ్రహం లభించి వీరికి అనుకున్న పనుల్లో అనుకూలత లభిస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి కొత్త పదోన్నతులు లభించి జీతాలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. కిరాణం కొట్టు వ్యాపారాలు ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే వృత్తి జీవితం కొనసాగిస్తున్న వారికి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో ఆనందం పెరగడమే కాకుండా సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల ఉన్నత శిఖరాలకు చేరే ఛాన్స్ ఉంది. అలాగే ఇళ్లలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News