Vinayaka Chaturthi 2022: వినాయక చతుర్థి ఎప్పుడు, ప్రాముఖ్యతేంటి, ఆ రోజు ఏం చేయాలి

Vinayaka Chaturthi 2022:  ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చతుర్థిని వినాయక చతుర్థి అని అంటారు. ఇది ఈ ఏడాది జూలై 3 ఆదివారం నాడు వస్తుంది. పూజా విధానం, శుభ సమయం గురించి తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 07:31 PM IST
  • జూలై 3న వినాయక చతుర్థి
  • వ్రత పూజ ముహూర్తం, 2 .యోగాలు గురించి తెలుసుకోండి
Vinayaka Chaturthi 2022:  వినాయక చతుర్థి ఎప్పుడు, ప్రాముఖ్యతేంటి, ఆ రోజు ఏం చేయాలి

Vinayak Chaturthi 2022 Significance: ప్రతి నెలలో వచ్చే రెండు చతుర్థి తిథులు వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం ఉండి గణపతి పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టి చతుర్థి అని, శుక్ల పక్షంలో వచ్చే చతుర్థిని వినాయక చతుర్థి (Vinayak Chaturthi 2022 ) అని అంటారు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని వినాయక చతుర్థి జూలై 3 ఆదివారం నాడు వస్తుంది. 

వినాయక చతుర్థి నాడు చంద్రుని దర్శనం అశుభం కనుక ఈ రోజున గణేష్ ఆరాధన మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని నమ్ముతారు. ఈ రోజున వినాయక చతుర్థి ఆదివారం వస్తుంది మరియు అదే సమయంలో ఈ రోజున రెండు శుభ యోగాలు కూడా ఏర్పడతాయి. అవి రవియోగం, సిద్ధి యోగం. ఈ యోగాలలో పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 

వినాయక చతుర్థి శుభ యోగం
వినాయక చతుర్థి ఆదివారం నాడు రావడంతో ఈ రోజున రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఒక రవియోగం - ఉదయం 5:28 నుండి 6.30 వరకు మరియు సిద్ధి యోగం రాత్రి 12.07 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈ యోగంలో అన్ని కార్యాలు విజయవంతమవుతాయని నమ్ముతారు. ఈ రోజు శుభ సమయం రాత్రి 11.57 నుండి 12.53 వరకు.

పూజ ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి 02 జూలై, శనివారం మధ్యాహ్నం 03.16 గంటల నుండి ప్రారంభమై.. జూలై 03, ఆదివారం సాయంత్రం 05.06 గంటలకు ముగుస్తుంది. ఈ రోజు రాత్రి 11.02 గంటలకు గణపతిని పూజించే శుభ ముహూర్తాలు రాత్రి 01.49 గంటల వరకు కొనసాగుతాయి. రాహుకాల సమయాలు.. సాయంత్రం 05:39 నుండి 07:23 వరకు.

పూజా విధానం 
ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. అంతేకాకుండా ఈ రోజు ఉపవాసం ఉంటూ వినాయకుడిని ప్రార్థించండి. దీని తర్వాత శుభ సమయం ప్రకారం పూజలు చేయండి. గణేశుడికి గంధపు తిలకం పూయడంతోపాటు బట్టలు, కుంకుమ, ధూపం, దీపం, తమలపాకు, మొదలైన వాటిని సమర్పించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పూజలో దుర్వాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలి. గణేశుడికి దూర్వా అంటే చాలా ఇష్టమని నమ్ముతారు. పూజానంతరం గణేశుడికి లడ్డూలను సమర్పించండి. గణేష్ చాలీసా మరియు వినాయక చతుర్థి ఉపవాస కథను పఠించండి. ఇలా పూజించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also Read; Plant Vastu Tips: ఈ మొక్కను ఇంట్లో నాటండి.. దీని అద్భుత ప్రయోజనాలు మీరే చూడండి! 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News