Babar Azam breaks Virat Kohli's record: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్లో (T20 World cup 2021) టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును (Virat Kohili) దాటి.. ఈ ఘనతను సాధించడం విశేషం.
దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా.. నిన్న రాత్రి (శుక్రవారం) పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (Pak vs Afg match news) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్-2లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా పాకిస్థాన్ నిలిచిది.
వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి.. ఆ జట్టు సెమీస్‌కు మరింత చేరువైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్, నమీబియా లాంటి చిన్న జట్లతో తలపడాల్సి ఉంది. దీనితో సెమీస్‌పై పాక్ జట్టు ధీమాగా ఉంది.
Also read: Afg vs Pak Match Highlights: టీ20లో హ్యాట్రిక్ కొట్టిన పాక్.. ఆఫ్గనిస్తాన్‌పై పాక్ ఘన విజయం
Also read: T10 League 2021 Coaches: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పురుషుల జట్టుకు మహిళా కోచ్
బాబర్ అజామ్ రికార్డు ఇది..
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 147/6 స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాక్ 19 ఓవర్లలోనే విజయం సాధించింది. పాక్ ఆటగాడు అసిఫ్ అలీ ఒకే ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది పాక్‌కు ఘన విజయం అందించాడు.
అంతకుముందు బాబర్ అజామ్ 47 బందుల్లో అర్ధశతకంతో (51 పరుగులు) మెరిశాడు. ఈ క్రమంలోనే అతడు టీ20ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. 26 ఇన్నింగ్స్‌లోనే బాబర్ అజామ్ ఈ ఘనతను సాధించడం గమనార్హం. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రికార్డును 30 ఇన్నింగ్స్‌లో అందుకున్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ 31 ఇన్నింగ్స్‌లో, ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 32 ఇన్నింగ్స్‌లో, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 36 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.
Also read: Warner imitate Ronaldo: రొనాల్డోను అనుకరించిన డేవిడ్ వార్నర్- ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నవ్వులు!
Also read: David Warner IPL Auction: ‘సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నన్ను రిటైన్ చేసుకోవడం కష్టమే‘
రషీద్ ఖాన్ అరుదైన రికార్డు..
శుక్రవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్ ఓడిపోయినా.. ఆ జట్టు బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన (Rashid Khan new record) ఘనతను తన ఖాతాలో వేసుకున్నారుడు.
గత మ్యాచ్‌లో అతడు.. బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్ (10)లను ఔట్ చేయడం ద్వారా టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ 76 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. రషీద్ 53 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు చేరుకోవడం విశేషం.
న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ 82 ఇన్నింగ్స్‌లలో, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ 83 ఇన్నింగ్స్‌లతో ఈ ఘనతను సాధించారు. వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గాను రషీద్ రికార్డు నమోద చేశాడు. వన్డే, టీ20 రెండు ఫార్మాట్లలోనూ ఈ ఘతన రషీద్‌పైనే ఉండటం విశేషం.
Also read: INDIA vs Pak: భారత్-పాక్ టీ20 మ్యాచ్‌పై ఆగని వివాదాలు.. కొనసాగుతున్న అరెస్ట్‌లు
Also read: T20 rankings: టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC.. దిగజారిన కోహ్లీ, రాహుల్ ర్యాంకులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook