Kuldeep Yadav Mind Blowing Delivery in Ind Vs Aus 3rd Odi: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ అత్యధిక ఇన్నింగ్స్‌లో 47 పరుగులు చేయగా.. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ 3-3 వికెట్లు తీశారు. ఇప్పుడు ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవాలంటే భారత జట్టు 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆసీస్ ఓపెనింగ్ జోడీ మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మొదటి వికెట్‌కు 68 పరుగుల జోడించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తరువాత స్వల్ప వ్యవధిలో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు పడగొట్టి కంగారూ జట్టును కంగారు పెట్టాడు. టాప్ ఆర్డర్‌ను పాండ్యా పెవిలియన్‌కు పంపించగా.. మిడిల్ ఆర్డర్‌ను దెబ్బ తీశాడు కుల్దీప్ యాదవ్.
ఇన్నింగ్స్ 39 ఓవర్ తొలి బంతికి కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ కార్వీకి దిమ్మతిరిగింది. కుల్దీప్ స్ట్రైట్ బంతి వేయగా.. కార్వీ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి ఏ మాత్రం దూసుకువెళ్లి నేరుగా వికెట్లను పడగొట్టింది. దీంతో కార్వీ (38)షాక్ గురై నేరుగా పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ కార్వీ వికెట్‌తోపాటు డేవిడ్ వార్నర్ (23), లాబుషేన్ (28) వికెట్లను తీశాడు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ వేసిన బాల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Bamboozled 💥
An epic delivery from @imkuldeep18 to get Alex Carey out!
Australia 7⃣ down now.
Follow the match ▶️ https://t.co/eNLPoZpSfQ #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/DCNabrEGON
— BCCI (@BCCI) March 22, 2023
138 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను మార్కస్ స్టోయినిస్ (25)తో కలిసి కార్వీ ఆదుకున్నాడు. వీరిద్దరు 6వ వికెట్‌కు 54 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యంతో జట్టు స్కోరును 200కి దాటించారు. కార్వీని కుల్దీప్ ఔట్ చేయడంతో భారీ స్కోరు ఆశలకు చెక్ పడింది. లోయర్ ఆర్డర్‌లో సీన్ అబాట్, అష్టన్ అగర్ 8వ వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యంతో స్కోరును 250 పరుగులకు చేర్చారు. సీన్ అబాట్ 26 పరుగులు చేయగా.. అష్టన్ అగర్ 17 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా చివరి వికెట్‌కు 22 పరుగులను జోడించారు. భారత బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్లు తీశారు.
Also Read: Loan Recovery Rules: లోన్ చెల్లించలేకపోతున్నారా..? రికవరీ ఏజెంట్లు బెదిరిస్తే ఇలా చేయండి
Also Read: Ind Vs Aus: రాణించిన బౌలర్లు.. భారత్ లక్ష్యం ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook