IND vs AUS: 2-1తో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ఆ జట్టే గెలుస్తుంది.. మహేల జయవర్దనే జోస్యం!

Mahela Jayawardene says Australia to win the Border Gavaskar Trophy 2023 Test series in India. బోర్డర్‌-గవాస్కర్ 2023 ట్రోఫీపై శ్రీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే తన అభిప్రాయం వెల్లడించారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 6, 2023, 04:37 PM IST
  • బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ఆ జట్టే గెలుస్తుంది
  • మహేల జయవర్దనే జోస్యం
  • ఆసీస్‌కు మంచి బౌలింగ్ దళం ఉంది
IND vs AUS: 2-1తో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ఆ జట్టే గెలుస్తుంది.. మహేల జయవర్దనే జోస్యం!

Mahela Jayawardene feels Australia won Border Gavaskar Trophy 2023 with 2-1 vs India: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య త్వరలో బోర్డర్‌-గవాస్కర్ 2023 ట్రోఫీ ప్రారంభం అవుతుంది. 4 టెస్టుల సిరీస్‌లోని  మొదటి టెస్ట్ నాగపూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. భారత్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం కాబట్టి.. స్పిన్నర్ల బౌలింగ్‌లో బ్యాటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో మాజీలు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఏ జట్టు విజయం సాధిస్తుందని ముందే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే తన అభిప్రాయం వెల్లడించారు. భారత్, ఆస్ట్రేలియా పటిష్టమైన జట్లే అని, అయితే సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.

తాజాగా ఐసీసీతో మహేల జయవర్దనే మాట్లాడుతూ... 'భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. భారత్ పరిస్థితులను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసీస్‌కు మంచి బౌలింగ్ దళం ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. తొలి టెస్టులో ఏ జట్టు విజయం సాధిస్తుందో.. వారికి ఒక మంచి ప్రారంభం దొరుకుతుంది. అయితే ఎవరు విజేతగా నిలుస్తారనేది చెప్పడం మాత్రం కష్టం' అని అన్నారు. 

'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని నేను భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుంది. అయితే ఆసీస్‌కు భారత్‌ గట్టి పోటీని ఇస్తుంది' అని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అంచనా వేశారు. 1996-97లో తొలిసారి జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకొంది. 2016-17, 2018 -2019, 2020-2021 సీజన్లలోనూ భారత జట్టే ట్రోఫీలను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు కూడా ట్రోఫీని సొంతం చేసుకొంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ను వరుసగా నాలుగో సారి సొంతం చేసుకొంటుంది. 

Also Read: TS Budget 2023-24: సామాన్యులకు శుభవార్త.. సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షల ఆర్థిక సాయం!  

Also Read: Upcoming Cars 2023: భారత మార్కెట్లోకి రెండు కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీలు.. హ్యుందాయ్ క్రెటాకు మొదలు కానున్న కష్టాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News