వెస్టిండీస్‌తో భారత్ నేడు మరో పోరుకు సిద్ధమైంది. టెస్ట్ సిరీస్‌లో విండీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసి భారత్.. ఐదు వన్డేల సిరీస్‌ను కూడా గెలిచి తన సత్తాను చాటాలని కోహ్లీ సేన భావిస్తోంది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా తొలి వన్డేను నేడు గౌహతి వేదికగా ఆడనుంది. కాగా తొలి వన్డే మ్యాచ్‌కు సంబంధించి కొద్దిసేపటి క్రితం భారత్ టాస్ గెలిచి... బౌలింగ్ ఎంచుకుంది.
#INDvWI 1st ODI: India win the toss & elect to bowl first. pic.twitter.com/zytxReS1dJ
— ANI (@ANI) October 21, 2018
వెస్టిండీస్, టీమిండియా జట్ల మధ్య ఇవాళ (ఆదివారం,అక్టోబర్-21) తొలి వన్డే గౌహతి బర్సాపారా గ్రౌండ్‌లో జరగనుంది. యువ ఆటగాడు రిషభ్ పంత్ తొలిసారి వన్డే జట్టులోకి అరంగేట్రం చేశాడు. బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
మరోవైపు టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడి విమర్శలు ఎదుర్కొన్న విండీస్ వన్డేల్లోనైనా గట్టి పోటీనివ్వాలని ప్రయత్నిస్తోంది. 'కుర్రాళ్లు వన్డే సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారత్‌ను స్వదేశంలో ఓడించడం కష్టమని మాకు తెలుసు. కానీ.. మేము గట్టి పోటీనిచ్చేలా ప్రయత్నిస్తాము' అని విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నారు.
కాగా.. భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకు 121 వన్డేలు జరగ్గా.. భారత్ 56 మ్యాచుల్లో, విండీస్ 61 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా మరో మూడు వన్డేల్లో ఫలితం తేలలేదు.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: విరాట్ కోహ్లీ( కెప్టెన్), రోహిత్ శర్మ, ధోనీ (వికెట్ కీపర్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కుల్దిప్ యాదవ్, ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్
వెస్టిండీస్: జాసన్ హోల్డర్ (కెప్టెన్), షాయ్ హోప్ (వికెట్ కీపర్), సునీల్ అంబ్రిస్, కీరన్ పావెల్, శిమ్రోన్ హెట్‌మైర్, మార్లోన్ సామ్యూల్స్, రోవ్‌మన్ పావెల్, ఆశ్లే నర్సే, కీమో పాల్, దేవేంద్ర బిషూ, కెమర్ రోచ్, ఫాభియాన్ అల్లెన్, ఒబెడ్ మెక్ కాయ్, ఒశానే థామస్, చంద్ర పాల్ హేమరాజ్<
Announcement: #TeamIndia announce the 12 for the 1st ODI in Guwahati against West Indies #INDvWI pic.twitter.com/j32SXgSFTT
— BCCI (@BCCI) October 20, 2018